దుర్గాదేవి అలంకరణలో వాసవి అమ్మవారు.
అద్దంకిలోని శ్రీ చక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజు ఆదివారం అమ్మవారిని దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయంలోని అమ్మవారికి ఆలయ పూజారి స్వర్ణ సుబ్బారావు నేతృత్వంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధ్యక్షుడు ఊటుకూరి రామకోటేశ్వరరావు, సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.