దుర్భరంగా మూలపేట రోడ్డు
దుర్భరంగా మూలపేట రోడ్డు
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్
నగర పాలక సంస్థ పరిధిలోని మూలపేట రోడ్డు దుర్భరంగా ఉంది. ఈ ప్రాంతంలో చాలాచోట్ల రోడ్లు గుంటలు మయంగా మారినాయి. కొద్దిపాటి వర్షం వచ్చిన ఈ ప్రాంతంలో నీరు నిలిచి పోతుంది. దీంతో ఈ మార్గంలో నడిచే ప్రజలు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విద్యాసంస్థలు ఉన్న ఈ ప్రాంతంలో కనీస వసతులు లేకపోవడం విశేషం. రోడ్డంతా దెబ్బతిని వాహనదారులు నిత్యం అవస్థలు పడుతున్నారు. ఈ ప్రాంతం గుంటలమయంగా మారింది. కనీసం ఈ ప్రాంతంలో పర్యటించిన ప్రజాప్రతినిధి, అధికారులు లేకపోవడం విశేషం. నిత్యం రద్దీ ఉండే ఈ ప్రాంతంలో రోడ్డంతా దెబ్బతిని దుర్భరంగా మారింది. దీనివల్ల ప్రజలు రాకపోకలు సాగించాలంటే నిత్యం అవస్థలు పడుతున్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ ప్రాంతం పై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా రోడ్డును బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.