BREAKING
ఆధునిక సాంకేతికతతో విద్యుత్ రంగం, సరికొత్త ప్రగతికి సంకేతం. రీ సర్వే తో భూమి సమస్యల పరిష్కారం - ఖమ్మం జిల్లా కలెక్టర్ కోటేకల్‌లో ఘనంగా శ్రీరామ హృదయ కలశం ఊరేగింపు బుల్లెట్ దేవి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు. చిన్న తగదాలతో కోర్టులను ఆశ్రయించవద్దు మంగళగిరి నియోజకవర్గం మెల్లెంపూడిలో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు క్విజ్ లో గోకవరం విద్యార్థి కి ప్రథమ స్థానం వైసీపీ గెలుపుకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి భోగాపురంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు మురుగు నీటితో ఇల్లందు ప్రజల అవస్థలు నాలుగు మధ్య షాపులకు టెండర్లు ఖరారు అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మెగా వైద్య శిబిరం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి వైయస్సార్సీపీ నేత వడ్డీ రఘురాం సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా, దసరా అడ్వాన్స్ ఇవ్వాలి - రావిపాడు లో జల్ జీవన్ మిషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ బొలిశెట్టి

డంపింగ్ యార్డ్ తో కాలుష్యం.... దుర్గంధం.... ఊపిరితిత్తుల వ్యాధులు.

Select Suryaa Now
డంపింగ్ యార్డ్ తో కాలుష్యం.... దుర్గంధం.... ఊపిరితిత్తుల వ్యాధులు.

ప్రభుత్వ అధికారులకు వినతిపత్రం ఇచ్చిన గ్రామస్తులు…

ముత్తుకూరు, మేజర్ న్యూస్ :   డంపింగ్ యార్డ్ తో కాలుష్యం, కుళ్ళిన చెత్త మూలంగా దుర్గంధం, ఊపిరితిత్తుల వ్యాధులతో జబ్బుల బారిన పడుతున్నామని మమ్మల్ని కాపాడాలంటూ ఎమ్మార్వో కాలనీ వాసులు ప్రభుత్వ అధికారులను వేడుకున్నారు. ముత్తుకూరు గ్రామపంచాయతీ పరిధిలోని తాసిల్దార్ కార్యాలయం సమీపాన గిరిజన కాలనీ వెంబడి ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల పడుతున్న బాధల గురించి గ్రామస్తులు ప్రభుత్వ అధికారులకు బుధవారం వినతి పత్రాన్ని అందజేశారు. పందులు డంపింగ్ యార్డ్ లో సంచరించి మురికితో గ్రామంలోకి వస్తున్నాయని అధికారులకు చెప్పారు. చెత్తను కాలుస్తున్నారని ఆ సమయంలో విష వాయువులు పొగ రూపంలో ఉన్నాయన్నారు. చెత్తంతా మురికి కాలువలకు అడ్డుగా పడి ఉందన్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి శాస్త్రీయ విధానములో చెత్తను సంపదగా మార్పుదల చేస్తూ కాలుష్యం నుంచి జబ్బుల బారి నుండి కాపాడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు