BREAKING
సౌదీ అరేబియా రక్షణకు బ్రిటన్ కీలక నిర్ణయం: రాయల్ ఎయిర్‌ఫోర్స్ టైఫూన్ యుద్ధ విమానాల మోహరింపు! ఫ్రాన్స్ హింసాత్మక అల్లర్లు: మరిన్ని నగరాల్లో కర్ఫ్యూ విధింపుపై ప్రధాని ప్రకటన ఇరాన్ పాలకుల పాలనను అంతమొందించడమే మా లక్ష్యం: నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు.. భారత్-అమెరికా బంధం: వాణిజ్యం, భద్రతపై జైశంకర్ ఉన్నత స్థాయి భేటీ ఫారమ్ 173A అంటే ఏమిటి?: ప్రభుత్వ సెక్యూరిటీలపై పన్ను మినహాయింపుల కోసం సీబీడీటీ కొత్త నిబంధనలు! MSCI హెచ్చరికలతో కుప్పకూలిన ఇండోనేషియా స్టాక్ మార్కెట్.. 2031 నాటికి హార్ముజ్ జలసంధి ప్రాధాన్యత కనుమరుగు: హెచ్‌ఎస్‌బీసీ సీఈవో పండుగల వేళ ఈ-కామర్స్ జోరు: ఫ్లిప్‌కార్ట్ యాక్టివ్ యూజర్లలో సరికొత్త రికార్డు.. బోఫా (BofA) నివేదికలో కీలక వెల్లడి! పండుగల వేళ అమెజాన్ బంపర్ రిక్రూట్‌మెంట్: 3 లక్షల మందికి పైగా నియామకాలు.. ఫ్యాక్టరీ ప్రమాదం దర్యాప్తులో షెఫ్లర్ ఇండియా సీఈవో హర్ష కదమ్‌ను అదుపులోకి తీసుకున్న పూణే పోలీసులు! నేటి పంచాంగం 21 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –21 అక్టోబర్ 2026 అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్యెల్యే ఉగ్ర నరసింహారెడ్డి దసరా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట బందోబస్తు మెట్లకుంట దుర్గామాత ఉత్సవాల్లో పోలీసుల సేవలకు సలాం.. ఏఎస్ఐ జైపాల్ రెడ్డికి ఘన సన్మానం

ధనలక్ష్మీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీమహమ్మారమ్మ

Select Suryaa Now
ధనలక్ష్మీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీమహమ్మారమ్మ


మదనపల్లె,మేజర్ న్యూస్ : మదనపల్లి పట్టణం,ఎస్బిఐ కాలనీ నందు వెలసిన శ్రీమహమ్మారమ్మ తల్లి దేవస్థానం నందు శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.ఇందులో భాగంగా తొమ్మిదో రోజైన సోమవారం ధనలక్ష్మీ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.ఆలయ ప్రధాన అర్చకులు శివకుమార్ శర్మ,అర్చకులు నారాయణ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు,అభిషేకాలు జరుగుతున్నాయి.ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధల నడుమ వేడుకలు జరుగుతున్నాయి.అమ్మవారికి పంచామృతా భిషేకం,తీర్థప్రసాద వినియోగము,లలిత సహస్రనామ కుంకుమార్చన,ప్రాకారోత్సవం,అమ్మవారికి దశ విదహారతులు,మహా మంగళ హారతి నిర్వహించారు.ఇందులో భాగంగా ఆలయ కమిటీ అధ్యక్షులు బొమ్మాడి రామకృష్ణారెడ్డి,గౌరవ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి,నాదెళ్ళ వెంకటేశ్వర ప్రసాద్ (శివన్న),డి.ద్వారకనాథ రెడ్డి,వైస్ చైర్మన్ 
కొండుపల్లి ప్రసాద్ బాబు,సెక్రటరీ గంగాసాని మస్తాన్ రెడ్డి,ట్రెజరర్ పి.వి.శ్రీనివాస రామమూర్తి (భవాని శ్రీను),జాయింట్ సెక్రటరీ ఎస్.మాధవ రెడ్డి 
కో-ట్రెజరర్ బిఎం.వెంకటరమణ,ఆలయ ట్రస్టీలు బి.వెంకటేశ్వర రెడ్డి,శ్రీరామ సహదేవ నాయుడు,మారువేణి వెంకట్రాయుడు,మయూరి రఘునాథ్ రెడ్డి,ఎన్.సాంబశివారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శరన్నవరాత్రి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని,ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయడం జరుగుతోందన్నారు.కావున పుర ప్రజలు,అమ్మవారి భక్తులు నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి కృపాకటాక్షానికి పాత్రులు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్బిఐ కాలనీ ప్రజలు,ప్రముఖులు,అమ్మ వారి భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి