BREAKING
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలసిన కార్పొరేటర్ షాహినా. ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ సదాశివపల్లిలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన పరిషత్ ఎన్నికల ప్రచారం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఓటు హక్కును నిలబెట్టుకుందాం! ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీ కలిసిన కార్పొరేటర్ శంకర్ యాదవ్. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో సరళ ఫిజిక్స్ కాన్‌క్లేవ్`2026 కొమ్మరపూడి నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ ఆందోళన! టవర్ లైట్స్ కి శంకుస్థాపన అగ్ని ప్రమాదంలో బస్సు దగ్ధం చంద్రబాబును కలిసిన కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ ఏపిలగుంటలో పొడమేకల ముమ్మర ప్రచారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై లారీలు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు! భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనగా నిర్వహించిన గ్రామ సర్పంచ్

దేవరదిబ్బ గిరిజన కాలనీలో..... అధికార పార్టీ నాయకులు పర్యటన

Select Suryaa Now
దేవరదిబ్బ గిరిజన కాలనీలో..... అధికార పార్టీ నాయకులు పర్యటన

దేవరదిబ్బ గిరిజన కాలనీలో..... అధికార పార్టీ నాయకులు పర్యటన


సమస్యలు తెలుసుకున్నవైనం.


ముత్తుకూరు ,నవంబర్ 26 (మేజర్ న్యూస్) మండలంలోని పైనం పురం గ్రామపంచాయతీ దేవర దిబ్బ గిరిజన కాలనీలో గురువారం సాయంత్రం అధికార పార్టీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఘన స్వాగతం పలికారు. పార్టీ నాయకులు పెడకాల కాంతారావు, పట్టపు రమేష్, బల్లెం వెంకట రమణయ్య, వాంకిల శీనయ్య, మస్తానయ్య, పట్టపు భాస్కర్, కావలి ప్రసాద్, మరి కొంతమంది గ్రామస్తులు పెద్ద ఎత్తున గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గిరిజన కుటుంబాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ఐదు సంవత్సరాల పంచాయతీ పరిపాలనలో అప్పటి పాలకులు గ్రామానికి ఏమీ చేయలేదని తెలియజేసుకున్నారు. ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రం బూడిదగుంట వెంబడి నివసిస్తున్న దేవర దిబ్బ గిరిజన కాలనీ బూడిద కాలుష్యంతో అల్లాడిపోతుందని జీవన భృతి కోల్పోయిందని గిరిజనులు వాపోయారు. గత ఐదేళ్ల పంచాయతీ పరిపాలనలో ప్యాకేజీ ఇవ్వలేదని గిరిజన కుటుంబాలు అధికార పార్టీ నాయకుల వద్ద చెప్పుకోవడం జరిగింది. మరో ప్రాంతానికి తరలించి గృహాలు నిర్మించి రక్షించాలని వేడుకున్నప్పటికీ మోక్షం కలగలేదు అన్నారు. బూడిద బ్రతుకులు  సాగిస్తున్నామని గిరిజనులు అన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీ నాయకులు మాట్లాడారు. పంచాయతీలో కోట్లాది రూపాయల సిఎస్ఆర్ నిధులు దుర్వినియోగం అయినట్లు ఆరోపించారు. బూడిద గుంట కట్టలపై నీరు చల్లే కాంట్రాక్టు పనులు తీసుకొని లక్షలు స్వాహా చేశారని పనిచేసిన కాంట్రాక్టర్లపై టీడీపీ ఆరోపణలు చేసింది. నిజమే కదా అంటూ కాలనీవాసులు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు