దర్శిలో ఎస్సైపై వైసీపీ శ్రేణుల దాడి హేయమైన చర్య..
దర్శిలో ఎస్సైపై వైసీపీ శ్రేణుల దాడి హేయమైన చర్య..
ఎస్సై గాలి ఏడుకొండలుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
సూర్య న్యూస్ దర్శి.
పోలీసులపై దాడి ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కోరారు.
పోలీసు సిబ్బంది మనోధైర్యం కోల్పోవద్దని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం అండగా ఉంటుందని జీవీ భరోసా ఇచ్చారు.ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల మద్దతు పొందలేక అల్లర్లకు పాల్పడే ప్రయత్నాలను సహించేది లేదని, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కూటమి పూర్తి సహకారం అందిస్తుందని జీవీ స్పష్టం చేశారు.రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పోలీసులపై దాడికి పాల్పడిన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అన్ని స్థానాల్లో అఖండ విజయం సాధిస్తారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ధీమా వ్యక్తం చేశారు. శావల్యాపురం మండలంలోని పోట్లూరులో గల ఎస్సైకుటుంబ సభ్యులను ఫోన్ చేసి ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే ఆంజనేయులు కోరారు.