డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రచారంతో దద్దరిల్లిన తనపల్లి
తిరుపతి రూరల్
ఇంటింటికీ తిరుగుతూ కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన డాలర్స్ దివాకర్ రెడ్డి
అడుగడుగునా పూలవర్షం, హారతులతో ఘన స్వాగతం పలికిన తనపల్లి గ్రామ ప్రజలు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగరడం ఖాయమని ధీమా.
తిరుపతి రూరల్: తనపల్లి పంచాయతీలో కూటమి ఎంపీటీసీ తొండూరు పీరమ్మ,జడ్పీటీసీ ముచ్చేలి ధన లక్ష్మి అభ్యర్థులకు ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. తనపల్లి గ్రామంలో డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్న ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గ్రామంలోకి అడుగుపెట్టినప్పటి నుండే కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో,యువత తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా తనపల్లి పంచాయతీలోని ప్రతి వీధిలో, ప్రతి గడపకూ తిరుగుతూ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి ఓటర్లను ఆప్యాయంగా పలకరించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.చంద్రగిరి నియోజకవర్గంలో ముఖ్యంగా తిరుపతి రూరల్ మండలంలో రహదారులు, డ్రైనేజీ, తాగునీటి వసతి వంటి మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలపరిచిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను గెలిపిస్తే, ప్రభుత్వ నిధులను నేరుగా గ్రామాలకు తీసుకువచ్చి తనపల్లి పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతామని తెలిపారు.ప్రజలందరూ అభివృద్ధి వైపు నిలబడి, మన అభ్యర్థులకు అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలి అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులతో పాటు తనపల్లి పంచాయతీ కూటమి ముఖ్య నాయకులు, సీనియర్ నేతలు, కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.