చివరిరోజు 9 నామినేషన్ల దాఖలు..
సైదాపురం, మేజర్ న్యూస్ : సైదాపురం మండలం నందు మూడోరోజు మండల పరిషత్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా 9 మంది అభ్యర్ధులు తమ నామినష్లను దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి శ్రీనివాస రావు తెలిపారు.ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు శుక్రవారం చివరిరోజు కావడంతో మొత్తం 9 నామినేషన్లను అభ్యర్ధులు దాఖలు చేశారని చెప్పారు.ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ శుక్రవారంతో ముగిసిందని,దీంతో మొత్తం 62 నామినేషన్లు వచ్చాయన్నారు.ఇందులో తెలుగుదేశం పార్టీ నుండి 30,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున 27,బిజెపి తరపున 3,ఇద్దరు స్వతంత్ర అభ్యర్ధుల నుండి నామినేషన్లను స్వీకరించామని పేర్కొన్నారు.శనివారం ఉదయం 8 గంటల నుండి నామినేషన్ల పరిశీలన జరుగుతుందని తెలిపారు.
ఎంపీటీసీ సెగ్మెంట్ వారీగా వివరాలు...
1.తుమ్మల తలుపూరు 7
2.కలిచేడు 5
3.తురిమెర్ల 7
4.గ్రిద్దలూరు 5
5. ఊటుకూరు 4
6. రామసాగరం 6
7. సైదాపురం 6
8. చాగనం 4
9. మర్లపూడి 4
10. చీకవోలు 5
11. పాలురూ 5
12. అనంతమడుగు 4