BREAKING
యూఎస్ ఎన్నికల ఫలితాలపై ప్రపంచ దేశాల స్పందన *గ్రామ పంచాయతీ ఆవరణలో గల ఇంకుడు గుంత, కమ్యూనిటీ ఇంకుడు, బోర్వెల్ రీఛార్జ్ ముగ్గు పోసి ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బందెల సుజాత బాలకిషన్ కాంగ్రెస్ పరాజయంపై రిపబ్లికన్లు, ట్రంప్ స్పందన ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని స్పృహ కోల్పోయి మృతిచెందిన స్పానిష్ ఆటగాడు అమెరికా కాంగ్రెస్‌లో డెమొక్రాట్ల హవా కావలిలో వీధి ఆవుల స్వైరవిహారం తక్షణమే కట్టడి చేయాలి ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ జోరు.. తొలి రోజే మూడు పతకాలు కైవసం నిబంధనలను ఉల్లంఘించి బెల్ట్ షాప్ లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం:మునుగోడు ఎస్సై మొగుళ్ళ శోభన్ బాబు విద్యా విధానంలో మానసిక వికాసం: త్రిపుర, ఉత్తరాఖండ్‌లకు ప్రశంసలు రైతు మేళా, సీఎం సభ ఏర్పాట్లపై ఎస్పీ స్నేహ మెహ్ర క్షేత్రస్థాయి పరిశీలన అమెరికా లేబర్ మార్కెట్‌లో సానుకూలత ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన అవనిగడ్డలో పోలింగ్ సామగ్రి పంపిణీ, ఓట్ల లెక్కింపు కేంద్రాల తనిఖీ కోహ్లీ హాఫ్ సెంచరీ, అర్ష్‌దీప్ 4 వికెట్లు.. అయినా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అన్షుల్ కాంబోజ్‌కే ఎందుకంటే? ఈక్విటాస్ బ్యాంక్ తాత్కాలిక సీఈవోగా బాలాజీ నూతలపాటి వీఎస్‌యూ డీన్ అకడమిక్ అఫైర్స్‌గా ఆచార్య అందే ప్రసాద్ నియామకం

చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం

Select Suryaa Now
చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం

అనంతపురం విద్య, మేజర్ న్యూస్ :-ప్రభుత్వ ఆర్ట్స్   కళాశాల  అనంతపురం ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ఆధ్వర్యంలో బ్రిక్స్‌ సుస్థిర జీవన వారోత్సవాల్లో భాగంగా ఆహారపు అలవాట్లు, చిరుధాన్యాల ప్రాముఖ్యత, ఆహార పదార్థాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీరాములు అధ్యక్షతన కళాశాల క్యాంటీన్‌ ఆవరణంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ.. పంటలు, పాలు, పండ్లు, కూరగాయల్లో రసాయనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వాటిని శుభ్రంగా కడిగిన తర్వాతే తీసుకోవాలని సూచించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ ఎం.ఎన్‌. బృంద మాట్లాడుతూ.. చిరుధాన్యాల్లోని పోషక విలువలు, వాటి ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. చిరుధాన్యాలు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు మధుమేహం, రక్తపోటు నియంత్రణకు తోడ్పడతాయని తెలిపారు. మరో అధికారి శ్రీనివాసులు చిరుధాన్యాల ఇతర ప్రయోజనాలను వివరించారు. అనంతరం చిరుధాన్యాల ప్రదర్శన నిర్వహించి, నినాదాలతో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు కేశాలు, మల్లికార్జున, రామకృష్ణ, రామచంద్ర, రమేష్, మంజునాథ్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..