చేసిన సేవలే గుర్తింపునిస్తాయి.. ఎస్సీ ప్రజా ప్రతినిధులకు ఘనంగా ఆత్మీయ సన్మానం
నరసన్నపేట, సూర్య : నరసన్నపేట పట్టణంలోని మేఘన కన్వెన్షన్‌లో ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాలకు చెందిన ప్రజాప్రతినిధులను ఘనంగా సత్కరించి, వారి సేవలను అభినందిస్తూ ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాప్రతినిధుల సేవలను గుర్తించి, వారిని గౌరవించే ఉద్దేశంతో ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వాహకులు తెలియజేశారు .
ఈ సందర్భంగా యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ, రాష్ట్రంలో దళితులపై కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడులకు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని అన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాప్రతినిధులందరూ కష్టపడి పనిచేయాలని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించే విధంగా సమష్టిగా కృషి చేయాలని కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ముంజేటి కృష్ణమూర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నాడ ఋషి , రాష్ట్ర కార్యదర్శి మురళిరాష్ట్ర కార్యదర్శి బురల్లి శంకర్రావు శంకర్రావుజిల్లా ఉప అధ్యక్షులు సతివాడ రామినాయుడు, నియోజవర్గ అధ్యక్షులు కల్లేపల్లి లక్ష్మణరావు నాయకులు, షెడ్యూల్డ్ కులాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.