BREAKING
తదుపరి జేమ్స్ బాండ్ ఎవరో ప్రకటించబోయి ఆపేసిన డెరైక్టర్ డెనిస్ విల్లెనూవ్: అభిమానులను ఊరించిన సంచలన వ్యాఖ్యలు ఇటాలియన్ బ్యాంకింగ్‌లో ప్రభుత్వ జోక్యం డిప్యూటీ విద్యాశాఖాధికారి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి ​నేటి నుండి కార్తీకమాసం ప్రారంభం ​భక్తులతో ఆలయాలకు పెరగనున్న సందడి ​శ్రీ కామేశ్వరి దేవి ఆలయం తెరుచుకునేనా? ​దేవాదాయ శాఖ అధికారుల తీరుపై భక్తుల ఆగ్రహం నోవోక్యూర్ బ్రెయిన్ క్యాన్సర్ పరికరానికి ఎఫ్‌డీఏ షాక్ వృద్ధులకు అన్నదానం ఎన్‌ఆర్‌జీ ఆరు గ్యాస్ పవర్ ప్లాంట్లను ఎల్‌ఎస్ పవర్‌కు విక్రయించేలా ఒప్పందం కొల్లివలస ఎంపీటీసీగా సివిల్ ఇంజనీర్ యువకుడు పెద్దవాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలి వేమూరు మండలంలో వైసీపీకి ఒక ఎంపీటీసీ ప్రధాన రహదారిపై చెట్ల పొదలు తొలగించాలి - ఎంపీడీవోకు ఉపసర్పంచ్ గిరుగుల చిన్నయ్య వినతి అంగన్వాడి కార్యకర్తలకు పోషణ భి.. పడాయి బి పై శిక్షణ కార్యక్రమం స్పానిష్ ఎన్నికలలో ఆధిక్యంలో దూసుకెళ్తున్న మితవాద కూటమి పరాగ్వే సెంట్రల్ బ్యాంక్ చీఫ్‌గా జార్జ్ ష్ప్రెయినర్ నియామకం ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు.. పాల్గొన్న ఎమ్మెల్సీ దండే విఠల్

చెరో తొమ్మిది.. చిక్కుల్లో పడిన ఎంపీపీ పీఠం!

Select Suryaa Now
చెరో తొమ్మిది.. చిక్కుల్లో పడిన ఎంపీపీ పీఠం!

గుర్ల, సూర్య : గుర్ల మండలంలో ఇటీవల వెలువడిన ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా ఆసక్తికర పరిణామాలకు తెరలేపాయి. మండలంలోని మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిది స్థానాలు, తెలుగుదేశం పార్టీ తొమ్మిది స్థానాలు గెలుచుకోవడంతో ఎంపీపీ పీఠం ఎవరికి దక్కుతుందన్నది ఉత్కంఠగా మారింది.
ఎంపీపీ పీఠాన్ని దక్కించుకోవాలంటే కనీసం పది మంది ఎంపీటీసీల మద్దతు అవసరం. అయితే ఇరు పార్టీలు చెరో తొమ్మిది స్థానాలు గెలుచుకోవడంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభించలేదు. దీంతో ఇరు పార్టీల ముఖ్య నేతలు రాజకీయ సమీకరణాలపై తలలు పట్టుకుంటున్నారు.
తొలుత వెలువడిన ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఎనిమిది స్థానాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాలు గెలుచుకోవడంతో మరో రెండు స్థానాలు వస్తే ఎంపీపీ పీఠం తమదేనని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. అయితే చివరి క్షణాల్లో వరుసగా మూడు ఎంపీటీసీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడటంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. తొమ్మిది స్థానాలు సాధించడంతో ఎంపీపీ పీఠం తమకే దక్కుతుందని భావించిన వైఎస్ఆర్ పార్టీ నేతలకు కూడా స్పష్టత లేకుండా పోయింది.
మండలంలో తమ బలాన్ని నిరూపించుకోవాలన్నట్లుగా ప్రజలు ఇరు పార్టీలకు సమాన స్థానాలు కట్టబెట్టడంతో ఇప్పుడు ఎంపీపీ పీఠం కోసం రాజకీయ చదరంగం మొదలైంది. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ తమకున్న బలాబలాలను కూడగట్టుకునేందుకు ఇరు పార్టీల నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
అధికారంలో ఉన్న తమ పార్టీకి అనుకూలమైన రాజకీయ పరిస్థితులను ఉపయోగించుకోవాలని టీడీపీ నేతలు ముఖ్య నాయకుల సలహాలు, సూచనలతో ముందుకు సాగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తాము ఏమాత్రం వెనక్కి తగ్గబోమని వైఎస్ఆర్ పార్టీ నేతలు కూడా తమ ముఖ్య నాయకుల సూచనలతో వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే గెలుపొందిన ఎంపీటీసీ సభ్యులను తమవైపు నుంచి చేజారకుండా ఇరు పార్టీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. తమ అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటూ రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఈ రాజకీయ చిక్కుముడి ఎప్పుడు వీడుతుంది? ఎంపీపీ పీఠం ఏ పార్టీకి దక్కుతుంది? తమ పార్టీ నేత ఎంపీపీ అవుతారా? అన్న సందేహాలు ఇరు పార్టీల కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారాయి. మొత్తానికి గుర్ల మండలంలో చెరో తొమ్మిది స్థానాలతో నెలకొన్న ఈ రాజకీయ ఉత్కంఠకు తెరపడాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే. ఎంపీపీ పీఠం కోసం సాగుతున్న ఈ పోరు మండల రాజకీయాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.