ఇంచార్జ్ మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు ను కలిసిన కొత్తగా ఎన్నికైన ఎంపిటిసి, జడ్పిటిసి లు
పాలకొండ, సూర్య : పాలకొండ నియోజకవర్గ శాసన సభ్యులు నిమ్మక జయకృష్ణ ఆదేశాల మేరకు సోమవారం, రాష్ట్ర వ్యవసాయ మరియు పశువర్ధక శాఖ మంత్రి వర్యులు మరియు పార్వతీపురం మన్యం జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు అయిన కింజరాపు అచ్చెన్నాయుడు నను వారి నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ కార్యదర్శి మరియు పాలకొండ నియోజకవర్గ ముఖ్య తెలుగుదేశం పార్టీ నాయకులు అయిన కర్నేన అప్పలనాయుడు సారధ్యంలో యువనాయకులు జాడ శ్రీధర్ మరియు మాజీ ఎంపీపీ వారాడ సుమంత్ నాయుడు సమక్షంలో కొత్తగా ఎన్నికైన పాలకొండ మండల జడ్పీటీసీ సభ్యుడు రాకోటి వెంకటరావు మరియు ఎనిమిది మంది కూటమి ఎంపీటీసీ సభ్యులు మరియు వారి ప్రతినిధులు కలిసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు:
1. కర్నేన యోగిత (డోలమడ)
2. కర్నేన పద్మిని ప్రియదర్శిని (వాటపాగు)
3. గొర్లె వరలక్ష్మి (తంపటాపల్లి)
4. వావిలపల్లి గౌతమి (పణుకువలస)
5. డొంపాక శ్రీను (వెలగవాడ)
6. కడగల పోలినాయుడు (గొట్టమంగాళాపురం)
7. కిమిడి అనురాధ (బాసూరు)
8. జామి శ్రీను (బుక్కూరు) పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి గారు ఎన్నికైన సభ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలియచేసి సీనియర్ నాయకులు శ్రీ కర్నేన అప్పలనాయుడు గారి సారథ్యంలో మీ అందరూ కలిసి పనిచేసి పాలకొండ మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని మరియు కూటమి నాయకత్వాన్ని ప్రతీ గ్రామంలో బలపరచాలని కోరారు.