భూమి ఆక్రమణపై బాధితుడి ఆవేదన ....
వెల్దుర్తి మేజర్ న్యూస్: వెల్దుర్తి మండలం ఎల్ .నగరం గ్రామ పంచాయతీ పరిధిలో తమ తండ్రికి చెందిన భూమిని అన్యాయంగా వేరేవారి పేరిట ఆక్రమించుకున్నారని బాధితుడు మౌలాలి ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని వెల్దుర్తిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.
ఎల్ .నగరం గ్రామ నివాసి అయిన M. అయ్యన్న కుమారులు M. మౌలాలి మరియు D. సురేష్‌ల తండ్రి పేరు మీద గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్: 805 లో 4.00 ఎకరాల భూమి ఉంది. అయితే ఆ భూమికి సంబంధించి తమ పేర్లు ఉండాల్సిన చోట, అజ్ఞాతదారులు అయిన కె. వెంకటేశ్వరరెడ్డి తదితరులు కలిసి అక్రమంగా పేర్లు ఎక్కించుకున్నారని బాధితులు వాపోయారు.
ఈ విషయంపై వీ.ఆర్.ఓ (V.R.O) నీ ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆరోపించారు. గత పదిహేనేళ్లుగా ఈ విషయమై కలెక్టర్ కి, ఆర్.డి.ఓకి, తహశీల్దార్‌తో పాటు పలువురు అధికారులకు అనేకసార్లు రాతపూర్వక ఫిర్యాదులు చేసినప్పటికీ ఎక్కడా న్యాయం జరగలేదని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, విచారణ జరిపి తమకు తగిన న్యాయం చేయాలని బాధితుడు M. మౌలాలి పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేశారు.