చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ను వెంటనే తొలగించాలి
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను వెంటనే తొలగించాలి
--సిపీ ఎం ర్యాలీ
ఆత్మకూరు, మేజర్ న్యూస్, సోమ వెంకటసుబ్బయ్య : దేశ వ్యా ప్త పిలుపులో భాగంగా వామపక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలో శుక్రవారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుండి , మున్సిపల్ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు జీ.వి. శివప్రసాద్ మాట్లాడుతూ ఈరోజు సర్ పేరుతో దేశంలో 13 కోట్ల మందిని ఓటు హక్కుకు దూరం చేశారన్నారు . అదేవిధంగా ఫామ్ 6 అనే పేరుతో 18 సంవత్సరాలు నిండినటువంటి యువతీ యువకులకు ఓటు హక్కు అవకాశం లేకుండా ఈరోజు వారి యొక్క తల్లిదండ్రులు వివరాలు నమోదు చేయాలని నిబంధనలు పెట్టినందువల్ల యువతీ యువకులు ఓటు హక్కుకు దూరమవుతున్నారన్నారు . గత పది నెలల నుండి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో ఉన్నటువంటి మిగతా ఇద్దరు కమీషనర్లు వీటన్నింటినీవ్యతిరేకించారని,14 సార్లు వ్యతిరేకించినా కూడా ఏకపక్షంగా ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈ విధానాన్ని ముందుకు తీసుకొచ్చారన్నారు . వీరి వెనక బిజెపి మోదీ , అమీత్ షాల యొక్క ప్రోత్బలంతోనే చీప్ ఎన్నికల కమిషనర్ ఈ నిర్ణయాలన్నీ అమలు చేశాడన్నారు. ఈ విషయంపై దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని నినాదంతో ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. జ్ఞానేష్ కుమార్ 2023లో అంతకుముందు ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్ చట్టాన్ని 2023లో మార్చారన్నారు . గతంలో చట్టం ఏ విధంగా ఉండేదంటే చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అదేవిధంగా ప్రధానమంత్రి ముగ్గురితో ఉండేటువంటి కమిటీ ఉండేదని,ఆ కమిటీని మార్చి ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడు సహచర మంత్రివర్యులు ఉండే విధంగా చట్టాన్ని మార్చారన్నారు . ఆ చట్టాన్ని ఇక్కడున్నటువంటి రెండు పార్టీలు ఆరోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి , తెలుగుదేశం బేషరతుగా మద్దతు ఇచ్చాయన్నారు . ఈరోజు వైఎస్ఆర్సిపి దాన్ని వ్యతిరేకిస్తుందన్నారు . ఇప్పుడు జరిగే ఆందోళనలో భాగస్వామ్యం కావాలని. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చేసేటటువంటి నిర్ణయాలను వ్యతిరేకించాలని ఎన్నికల కమిషనర్ రాజీనామా చేసేంతవరకు పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది శేషారెడ్డి,సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి కొప్పోలు డేవిడ్ రాజు , మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సందాని, సిఐటియు మండల అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య, సిపిఐ పట్టణ అధ్యక్షులు జంగం నాగరాజు, సిపిఎం పార్టీ నాయకులు ఎం నాగేంద్ర , ఆళ్ల హాజరత్తయ్య , ఐద్వా నాయకురాలు గుల్జార్ బేగం , కొండా లక్ష్మమ్మ, రమణయ్య, ప్రజానాట్యమండలి నాయకులు గద్దర్ బాబు, పెద్ద ఎత్తున, మహిళలు పాల్గొన్నారు.