BREAKING
నిత్యం పండ్లు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: సహజ సిద్ధమైన విటమిన్లు, ఫైబర్‌తో పరిపూర్ణ ఆరోగ్యం ఇరువురు తహసీల్దార్ లు, ఇరువురు డిప్యూటీ తహసిల్దార్ లపై క్రమశిక్షణ చర్యలు. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.95 లక్షలు నిత్యం పప్పులు, శనగలు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: ఆరోగ్యానికి ప్రొటీన్, ఫైబర్ పెన్సిలిన్ పెన్షన్లు అందని పేదలకు బొండా ఉమా అండ * సొంత నిధులతో ప్రతినెలా ఆర్థిక సాయం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ స్పీచ్: అభిమానులకు మాస్ ప్రామిస్ పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు మానకొండూరులో పాత ఇనుప సామాను దుకాణంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి: 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానాలపై అధికారులకు శిక్షణ సరస్ మేళాకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాత్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత డీలర్ల సమస్యలు పరిష్కరించాలి తాసిల్దార్ కు వినతి పత్రం అందించిన డీలర్లు రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి తహశీల్దార్‌కు 46 మంది డీలర్ల వినతిపత్రం ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు - సురక్షితంగా బాలుడి అప్పగింత. - ముగ్గురు నిందితుల అరెస్ట్

చీడిగుమ్మలలో నూతన పీహెచ్‌సీ భవనానికి శంకుస్థాపన

Select Suryaa Now
చీడిగుమ్మలలో నూతన పీహెచ్‌సీ భవనానికి శంకుస్థాపన

 

- రూ. 1.93 కోట్లతో మినీ ఆసుపత్రి నిర్మాణం.. లాంఛనంగా పనులను ప్రారంభించిన స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు .
నర్సీపట్నం అక్టోబర్ 13 మేజర్ న్యూస్ :
గొలుగొండ మండలం చీడిగుమ్మల గ్రామంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) భవన నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన జరిగింది. రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు వారి సతీమణి చింతకాయల పద్మావతి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి, 1 కోటి 93 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఆసుపత్రి భవనానికి కొబ్బరికాయ కొట్టి, శిలాఫలకం ఆవిష్కరించి లాంఛనంగా పనులను ప్రారంభించారు.
చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించే ఉద్దేశంతో ఒక మినీ ఆసుపత్రి తరహాలో దీనిని నిర్మిస్తున్నామని, రాబోయే ఆరు నెలల్లో అంటే మార్చి నాటికి ఈ భవన నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు స్పష్టం చేశారు.  
​నియోజకవర్గ అభివృద్ధికి తాము ఎంతో చిత్తశుద్ధితో పని చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఒక్క చీడిగుమ్మల పంచాయతీ పరిధిలోనే గత రెండున్నరేళ్ల వ్యవధిలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టామని, గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం కోసం 2 కోట్ల 49 లక్షల రూపాయలు, శ్మశాన వాటికకు 10 లక్షల రూపాయలు మంజూరు చేశామన్నారు. నేడు శంకుస్థాపన చేసుకున్న 1 కోటి 93 లక్షల పీహెచ్‌సీ భవనంతో కలుపుకుని మొత్తంగా ఈ ఒక్క పంచాయతీకే 4 కోట్ల 52 లక్షల రూపాయల నిధులు అందించామని వివరించారు.
గొలుగొండ మండల వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం సుమారు 53 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏకంగా సుమారు 575 కోట్ల రూపాయలు వెచ్చించామని ఆయన పేర్కొన్నారు.  
​వచ్చే ఏడాదిలో గ్రామాల్లో రోడ్ల పక్కన మురుగు నీరు నిలవకుండా పూర్తి స్థాయిలో సిమెంట్ కాలువలు (డ్రైనేజీలు) నిర్మిస్తామని అయ్యన్నపాత్రుడు గారు హామీ ఇచ్చారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో గ్రామ అభివృద్ధికి సహకరించి, పనులు చేయించగలిగే దమ్మున్న మంచి నాయకులను ఎన్నుకోవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ మండల టీడీపీ నాయకులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.