భూమిరెడ్డి సునీత మృతి పట్ల వైఎస్సార్‌సీపీ నాయకుల సంతాపం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు మున్సిపాలిటీ 6వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమిరెడ్డి ఓబుల్ రెడ్డి గ సతీమణి భూమిరెడ్డి సునీత మృతి చెందారు. ఆమె మృతి పట్ల వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ చిల్లూరు అదిశేషయ్య, రాష్ట్ర మున్సిపల్ విభాగ కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు ఇందూరు సురేంద్ర రెడ్డి, జమృ, షకీరా తదితరులు భూమిరెడ్డి సునీత పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.