BREAKING
యూఎస్ ఎన్నికల ఫలితాలపై ప్రపంచ దేశాల స్పందన *గ్రామ పంచాయతీ ఆవరణలో గల ఇంకుడు గుంత, కమ్యూనిటీ ఇంకుడు, బోర్వెల్ రీఛార్జ్ ముగ్గు పోసి ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బందెల సుజాత బాలకిషన్ కాంగ్రెస్ పరాజయంపై రిపబ్లికన్లు, ట్రంప్ స్పందన ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని స్పృహ కోల్పోయి మృతిచెందిన స్పానిష్ ఆటగాడు అమెరికా కాంగ్రెస్‌లో డెమొక్రాట్ల హవా కావలిలో వీధి ఆవుల స్వైరవిహారం తక్షణమే కట్టడి చేయాలి ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ జోరు.. తొలి రోజే మూడు పతకాలు కైవసం నిబంధనలను ఉల్లంఘించి బెల్ట్ షాప్ లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం:మునుగోడు ఎస్సై మొగుళ్ళ శోభన్ బాబు విద్యా విధానంలో మానసిక వికాసం: త్రిపుర, ఉత్తరాఖండ్‌లకు ప్రశంసలు రైతు మేళా, సీఎం సభ ఏర్పాట్లపై ఎస్పీ స్నేహ మెహ్ర క్షేత్రస్థాయి పరిశీలన అమెరికా లేబర్ మార్కెట్‌లో సానుకూలత ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన అవనిగడ్డలో పోలింగ్ సామగ్రి పంపిణీ, ఓట్ల లెక్కింపు కేంద్రాల తనిఖీ కోహ్లీ హాఫ్ సెంచరీ, అర్ష్‌దీప్ 4 వికెట్లు.. అయినా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అన్షుల్ కాంబోజ్‌కే ఎందుకంటే? ఈక్విటాస్ బ్యాంక్ తాత్కాలిక సీఈవోగా బాలాజీ నూతలపాటి వీఎస్‌యూ డీన్ అకడమిక్ అఫైర్స్‌గా ఆచార్య అందే ప్రసాద్ నియామకం

భగినీ హస్తభోజనం రోజున గాజుల అలంకారంలో దర్శనమివ్వనున్న కనకదుర్గమ్మ

Select Suryaa Now
భగినీ హస్తభోజనం రోజున గాజుల అలంకారంలో దర్శనమివ్వనున్న కనకదుర్గమ్మ

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: కార్తీక శుద్ధ విదియ (భగినీ హస్తభోజనం – భ్రాతృవిదియ) పర్వదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 11న ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారు విశేష గాజుల అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారికి కుంకుమ, గాజులు అత్యంత ప్రీతిపాత్రమైనవి కావడంతో దేవస్థాన సంప్రదాయం ప్రకారం ఈ అలంకరణను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.

అమ్మవారి అలంకరణ నిమిత్తం విజయవాడకు చెందిన గ్రంధి రాము, రాధిక దంపతులు, శ్రీ కనకదుర్గ లలితా పారాయణ బృందం తరఫున 446 తోడాల గాజులను దేవస్థాన ఈవో వి.కె. శీనా నాయక్‌కు అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఈవో ప్రత్యేకంగా అభినందించారు. గాజుల అలంకరణ కోసం భక్తులు కూడా తమ వంతుగా గాజులను విరాళంగా సమర్పించవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు దేవస్థానం టోల్‌ఫ్రీ నంబర్‌ 18004259099ను సంప్రదించాలని సూచించారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.