BREAKING
వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ ముఖ్య నాయకులతో సమావేశం మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం మధుర మీనాక్షి అలంకారంలో చౌడేశ్వరి దేవి! సింగిల్ కట్ లేకుండా రణబాలి సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ అఫీషియల్ ఖరారు చీపురుపల్లి రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ కేంద్రం పరిశీలన ప్రత్యేక పూజలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం రూ.500 కోట్ల క్లబ్‌కు చేరువలో దృశ్యం 3.. మోహన్‌లాల్ ప్రశంసలతో అజయ్ దేవగణ్ రికార్డులు డి బీర్స్ డైమండ్స్‌లో వజ్రాల రాజధాని బోట్స్వానా వాటా పెంపు పార్వతీ దేవి అలంకారంలో బోయకొండ గంగమ్మ! లావేరు రోడ్డు దుకాణాల్లో చోరీ... కిరాణా షాపులో రూ.50 వేలు గల్లంతు ప్రభుత్వ బాండ్ ఈల్డ్‌ల పెరుగుదలతో అభద్రతలో అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు భూ సమస్యల పై కలెక్టర్ సానుకూల స్పందన

బీసీలకు రూ. 80,000 రాయితీతో సోలార్ విద్యుత్ ఏర్పాటు!

Select Suryaa Now
బీసీలకు రూ. 80,000 రాయితీతో సోలార్ విద్యుత్ ఏర్పాటు!

సూర్య న్యూస్ అద్దంకి.

బీసీ కమ్యూనిటీకి చెందిన ప్రజల కోసం ప్రత్యేక సోలార్ ఏర్పాటుకు సబ్సిడీని అందిస్తున్నట్లు అద్దంకి ఏడీఈ దామోదరం తెలిపారు. ఇంటిపై 100 చదరపు అడుగుల స్థలం ఉన్న బీసీ కమ్యూనిటీ వారు ఈ సోలార్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ. 60,000 మరియు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 20,000 అదనంగా సబ్సిడీ అందుతుందని వెల్లడించారు. దీని ద్వారా గృహ అవసరాలకు సరిపడా కరెంట్ తయారు చేసుకోవడంతో పాటు, అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను డిపార్ట్‌మెంట్‌కు ఎక్స్‌పోర్ట్ చేయడం ద్వారా యూనిట్‌కు రూ. 2.09 చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుందని ఆయన వివరించారు. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునే వారు తమ కరెంట్ బిల్లు, బ్యాంకు అకౌంట్ మరియు ఆధార్ కార్డు వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.