BREAKING
ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పి పి ఎల్)జిల్లా అధ్యక్షుడిగా ఉప్పలయ్య* విజయ కాలనీ అంగన్వాడీ కేంద్రానికి స్వచ్ఛ్ ఆంధ్ర అవార్డు చుండూరి నీ స్థాయేంటే....? జాతిపిత గాంధీజీ జయంతి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలు వైద్యాలయాలలో చేయరా ? కంచనపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక రామచంద్రపురం సబ్ జైలు తనిఖీ స్వచ్ఛ ఆంధ్రలో కమలాపురం ఆసుపత్రికి ప్రథమ స్థానం డాక్టర్ ఆమంచి శిరీషకు - కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు.. నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం… ఎమ్మెల్యే బొలిశెట్టి హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులు కు ఎంతో ఉపయోగకరం శిథిలావస్థకు చేరిన సిసి రోడ్లు స్థానిక ఎన్నికల్లో నూరుశాతం కూటమి గెలవాలి ఉపాధిహామీ నిధులతో రహదారుల నిర్మాణం మండపేట మున్సిపాలిటీకి స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు మౌలిక సదుపాయాల అభివృద్ధికి శ్రీకారం టిడిపి కూటమి ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి

బీసీలకు 34% రిజర్వేషన్లపై రాజీ లేదు

Select Suryaa Now
బీసీలకు 34% రిజర్వేషన్లపై రాజీ లేదు
  • సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం.. •న్యాయం జరిగే వరకు పోరాడతాం

•గొడ్డలి పార్టీ నేతలవి కుట్ర రాజకీయాలు

•నాయకులతో సమీక్షలో ఎమ్మెల్యే ఏలూరి 

 

మార్టూరు, మేజర్ న్యూస్ : 

వెనుకబడిన వర్గాలకు రాజకీయంగా చేయూతనిచ్చి, నాలుగు దశాబ్దాల క్రితమే వారికి అధికారంలో వాటా కల్పించిన పార్టీ తెలుగుదేశం. ఆ చారిత్రక బాధ్యతను విడిచిపెట్టబోమని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు...స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఇది కేవలం రిజర్వేషన్ల అంశమే కాదని, బీసీలకు దక్కాల్సిన రాజకీయ ప్రాతినిధ్యమని పేర్కొన్నారు. 

*ప్రభుత్వ నిర్ణయానికి అడ్డుపడ్డారు.*

బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో అసెంబ్లీలో బీసీలకు 34% రిజర్వేషన్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దానికి అనుగుణంగా జీవోలు జారీ చేస్తే వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికలు జరగకూడదని, బీసీలకు రిజర్వేషన్ దక్కకూడదనే కుట్రతో గొడ్డలి పార్టీ నేతలు పిటిషన్లు వేశారని మండిపడ్డారు. బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తే రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుందనే భయంతోనే న్యాయస్థానంలో పిటిషన్లు వేసి, బీసీలకు తీరని ద్రోహం చేశారని ధ్వజమెత్తారు.

*వైసీపీ హయాంలో 16,800 పదవులు కోల్పోయారు*

వైసీపీ హయాంలో 34% రిజర్వేషన్లను కోర్టు కొట్టివేస్తే సుప్రీంకోర్టుకు వెళ్లకుండా బీసీలకు చారిత్రాత్మక ద్రోహం చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. దీనివల్ల స్థానిక సంస్థల్లో 16,800 మంది బీసీలు పదవులు కోల్పోయారని తెలిపారు. ఇప్పుడు కూడా బీసీలకు పదవులు రాకూడదన్న కుట్రతో కోర్టుకు వెళ్లి నిస్సిగ్గుగా అడ్డుకున్నారని దుయ్యబట్టారు. అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా చేయాలనే అజెండాతో పనిచేస్తూ, వెనుకబడిన వర్గాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని, ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.

*సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం*

హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే బీసీలకు న్యాయం జరిగేలా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. న్యాయపరంగా ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటామని, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కల్పించాలన్న తమ సంకల్పం మారదని స్పష్టం చేశారు. 34% రిజర్వేషన్లతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. అన్ని వర్గాల హక్కులను కాపాడుతూ బీసీలకు రిజర్వేషన్లను పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని, బీసీలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేసేందుకు తెలుగుదేశం పార్టీ శ్రమిస్తోందని చెప్పారు.

*నాలుగు దశాబ్దాల చరిత్ర*

నాలుగు దశాబ్దాల క్రితమే బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి 1987లో 20%, 1995లో 34% రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలుగుదేశానిదేనని ఆయన గుర్తు చేశారు. బీసీలకు రాజకీయ సాధికారత అనేది టీడీపీ డీఎన్‌ఏలోనే ఉందన్నారు. సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీల అభ్యున్నతి కోసం ఇచ్చిన మాటపై ఎక్కడా వెనక్కి తగ్గబోమని, న్యాయం జరిగే వరకు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.