బీసీ కాలనీలో కొండచిలువ
బీసీ కాలనీలో కొండచిలువ
ఉదయగిరి,మేజర్ న్యూస్.
మండలంలోని గండిపాళెం బీసీ కాలనీలో గల ఖాసిం రత్తయ్య నివాస వరండాలోకి గురువారం తెల్లవారుజామున సుమారు 20 అడుగ ల పొడవు కలిగిన భారీ కొండచిలువ రావడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. వివరాల మేరకు.. రత్తయ్య వరండాలో నిద్రిస్తుండగా తెల్లవారుజామున తన నివాసంలో ఉన్న కుక్క అరుస్తుండడంతో మేల్కొన్నాడు. కుక్క అరుస్తున్న దగ్గరకు వెళ్లి చూడగా సమీపాన కొండచిలువ ఉండడంతో భయాందోళనకు గురై కుటుంబ సభ్యులతో బయటకు వచ్చి కాలనీ వాసులకు తెలియజేశాడు. అనంతం వారు పరిశీలించి అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. ఆటవీ శాఖాధికారులు సం ఘటనా స్థలానికి చేరుకుని పామును పట్టి అటవీ ప్రాంతంలో వదిలారు.