BREAKING
మొక్కజొన్న సాగులో మెలకువలపై శిక్షణ దీపావళి వేడుకలకు వెళ్లలేకపోయిన రిషి కపూర్.. అత్తగారు కవర్ చింపేసిన ఆసక్తికర ఘటన గుర్తుచేసుకున్న నీతూ కపూర్ సిద్దిపేట సభ ఏర్పాట్ల సమావేశంలో కాట శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు సర్పంచ్ ఎన్నికల వేడి.. సీట్ల కోసం కూటమిలో కుమ్ములాటలు! ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సీనియర్ నటుడు, దర్శకుడు టిన్ను ఆనంద్.. ఆరోగ్యంపై అప్‌డేట్ నాకు నచ్చిన పాత్రలు దొరకడం ఇప్పటికీ సవాలే.. సరైన అవకాశం కోసం వేచి చూస్తా: అదితి రావు హైదరి పోటీ నుంచి తప్పుకున్న రాంజీ యశ్ రాజ్ ఫిల్మ్స్ తొలి హారర్ చిత్రంలో వరుణ్ ధావన్.. దర్శకత్వం ఎవరిదంటే? రెండు ద్విచక్ర వాహనాలు డి... ఒకరు మృతి న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌కు గుర్నూర్ బ్రార్ ఎంపిక.. కుల్దీప్ యాదవ్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం సాండ్‌పేపర్ వివాదంపై డేవిడ్ వార్నర్ సంచలన ఆరోపణలు.. స్టార్క్, లయన్, హేజిల్‌వుడ్‌లను విచారించలేదంటూ క్రికెట్ ఆస్ట్రేలియాపై ఫైర్ 10వ తరగతి ఫలితాలు పై ప్రత్యేక దృష్టి టీ20 ఫార్మాట్‌లో వ్యూహాత్మక మార్పులే కీలకం.. కర్ణాటక యువ బ్యాటర్ స్మరన్ రవిచంద్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు దివ్య కుటుంబానికి అండగా ఉంగుటూరు ఎమ్మెల్యే, జనసేన నాయకులు

బాపట్ల జిల్లాలోని 351 గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి,

Select Suryaa Now
బాపట్ల జిల్లాలోని 351 గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి,

బాపట్ల, మేజర్‌న్యూస్ :

 బాపట్ల జిల్లాలోని 351 గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శనివారం మీడియా సమావేశం నిర్వహించారు.
       
       గ్రామపంచాయతీ ఎన్నికల ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో మొత్తం 3,362 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందు కొరకు 3,770 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 4,23,910 మంది పురుష ఓటర్లు ఉండగా, 4,43,995 మంది మహిళ ఓటర్లు ఉన్నారని, 49 మంది ఇతరులు ఉన్నారన్నారు. గ్రామ పంచాయితీలలో మొత్తం 8,67,954 మంది  ఓటర్లు ఉన్నారని తెలిపారు. మొదటి దశలో పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లు, చిన్నగంజాం, కారంచేడు, మార్టూరు, పర్చూరు, యద్దనపూడి మండలాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. రెండో దశలో వేమూరు, చీరాల నియోజకవర్గాల్లోని అమృతలూరు, భట్టిప్రోలు, చుండూరు, కొల్లూరు, వేమూరు, చీరాల, వేటపాలెం మండలాలలో ఎన్నికలు జరుగుతాయన్నారు. మూడో విడతలో బాపట్ల, రేపల్లె నియోజకవర్గాల్లోని బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం, రేపల్లె, నిజాంపట్నం, చెరుకుపల్లి, నగరం మండలాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.
       
    గ్రామ పంచాయతీలకు మొదటి దశలో ఈనెల 26వ తేదీన ఎన్నికలు జరగనున్నాయని కలెక్టర్ చెప్పారు. 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందన్నారు. 18వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు. 19వ తేదీన తిరస్కరణ గురైన నామినేషన్లకు ఆర్డీవోల వద్ద అప్పీల్ చేసుకొనే అవకాశం ఉందన్నారు. 20వ తేదీన అప్పిళ్లను పరిష్కరిస్తారని, 21వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందన్నారు. అదే రోజు పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తామన్నారు. 26వ తేదీన ఎన్నికలు జరుగుతాయన్నారు. అదేరోజు మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందన్నారు. ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ అదే రోజు జరుగుతుందన్నారు. 
       
      ప్రజాస్వామ్యంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు జిఓ నెంబర్ 11 ఆధారంగా బహుమతులను ఎన్నికల కమిషన్ ప్రకటించిందన్నారు. ఐదు వేలమంది జనాభా ఉన్న పంచాయితీలు ఏకగ్రీవం అయితే రూ.15 లక్షలు పంచాయతీ అభివృద్ధికి బహుమతి లభిస్తుందన్నారు. ఐదు వేల నుంచి పదివేల మంది జనాభా ఉన్న పంచాయితీలు ఏకగ్రీవమైతే రూ.25లక్షలు బహుమతి లభిస్తుందన్నారు. పదివేల మంది జనాభాకు మించి ఉండి ఏకగ్రీవం అయ్యే గ్రామ పంచాయితీకి రూ.50 లక్షలు బహుమతి వస్తుందన్నారు.
      
 - బాపట్ల మున్సిపాలిటీ ఎన్నికలు -
       బాపట్ల మున్సిపాలిటీ ఎన్నికల ప్రకటన విడుదల చేశామని కలెక్టర్ తెలిపారు. 14వ తేదీ నుంచి 16వ తేదీ సాయంత్రం మూడు గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుందన్నారు. 17వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు. ఈ నెల 19వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, తదుపరి పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తామన్నారు. ఈనెల 26వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు కలెక్టర్ సూచించారు. ఓటర్ల జాబితా విడుదల చేశామని, ప్రతి ఒక్కరు తమ ఓటు ఉందో లేదో తప్పనిసరిగా చూసుకోవాలని ఆయన తెలిపారు. ఏదైనా సమస్యలుంటే కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఓటర్ల కోసం ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు.