BREAKING
శ్రీ శ్రీ జగదాంబ అమ్మవారుకి పట్టు చీర సమర్పించిన చాట్రాతి కుటుంబ సభ్యులు కేతగుడిపిలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ.. టీడీపీలోకి 45 కుటుంబాలు!* బేతపూడి - రావి అనంతవరం బీటీ రహదారిని ప్రారంభించిన మంత్రులు దుద్దెడ శంభులింగేశ్వర క్షేత్ర కోనేరు పునర్నిర్మాణానికి సన్నాహాలు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్.చెక్కులు పంపిణీ ఖమ్మంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శన ప్రారంభం నందివాడ మండలంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు: తొలిరోజు 'బాలాత్రిపురసుందరి'గా అమ్మవార్ల దర్శనం స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధత గంధ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బి. ఎన్ సోషల్ మీడియా సమాచారపై జాగ్రత్తగా ఉండాలి:* ఎస్ఐ మహేష్ ఎల్‌నినో ప్రభావంపై.. రైతులకు అవగాహన కార్యక్రమం దశాబ్దాల నిరీక్షణకు తెర... 939 పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు శ్రీ కంచి కామాక్షి ఆలయంలో ప్రత్యేక పూజలు యువత స్వయం కృషితో ఎదగాలి కొడంగల్‌లో ఆశా వర్కర్ల ధర్నా.. దోమ పోలీస్‌ స్టేషన్‌కు తరలింపు

బాలికల విద్య, సమానత్వం, బాల్య వివాహాల నివారణపై గ్రామ ప్రజలకు అవగాహన

Select Suryaa Now
బాలికల విద్య, సమానత్వం, బాల్య వివాహాల నివారణపై గ్రామ ప్రజలకు అవగాహన

రేపల్లె, మేజర్ న్యూస్; బాలికలను చదివించి వారికి తగిన విలువనివ్వాలనీ  ప్రోగ్రామ్ మేనేజర్ లక్ష్మీ ప్రసన్న కోరారు ఆదివారం అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ (క్రాఫ్) ట్రస్ట్ ఆధ్వర్యంలో రేపల్లె మండలంలోని తుమ్మల, పిరట్లంక, పొతుమెరక, నల్లూరుపాలెం, విశ్వేశ్వరం, పెనుమూడి, కారుమూరు గ్రామాల్లో గ్రామ ప్రజలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ ప్సన్న మాట్లాడుతూ అబ్బాయిలతో సమానంగా చూడాలనే సందేశాన్ని ప్రజలకు వివరించారు. బాల్య వివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలియజేస్తూ బాల్య వివాహాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గ్రామ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ప్రజల భాగస్వామ్యంతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.
అదేవిధంగా, బాలికల విద్య ప్రాముఖ్యతను తెలియజేసేందుకు బాలికలు డాక్టర్, ఉపాధ్యాయురాలు, న్యాయవాది, కలెక్టర్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తదితర వృత్తులకు సంబంధించిన వేషధారణలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన ద్వారా బాలికలు విద్యను అభ్యసిస్తే వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలను చేరుకోగలరని, తమ కలలను సాకారం చేసుకోగలరని ప్రజలకు వివరించారు.బాలికలకు విద్యావకాశాలు కల్పించడం, వారి హక్కులను గౌరవించడం, లింగ వివక్షకు తావులేకుండా సమాన అవకాశాలు అందించడం ద్వారా బాలికల భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చని ఈ కార్యక్రమాల ద్వారా తెలియజేశారు. బాల్య వివాహాల నిర్మూలనతో పాటు బాలికల అభ్యున్నతికి సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలనీ ట్రస్ట్ ప్రతినిధులు పిలుపునిచ్చారు.బాలికల హక్కుల పరిరక్షణ, విద్య ప్రోత్సాహం, సమానత్వ సాధన లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు గ్రామ ప్రజల్లో ఆలోచనను రేకెత్తిస్తూ, బాలికల పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించేలా సాగాయి.ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్లు రత్న ఆంజెల్, ఝాన్సీ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.