BREAKING
పలు నూతన డిజిటల్ సేవలను ప్రారంభించనున్న రక్షణ మంత్రి ఫార్మసీలో మేనేజ్మెంట్ కోటా సీట్లను పెంచాలి కాంస్య పోరులో పరాజయం పాలైన అస్మిత డే భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ఆయుష్ సేవలు మషాఅల్లా ఎంటర్‌ప్రైజెస్ పేరుతో భారీ మోసం.. స్క్రబ్బర్ల వ్యాపారం పేరుతో రూ. 500 కోట్ల వసూలు ఈసీఐఎల్‌లో హిట్ అండ్ రన్.. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి దూసుకెళ్లిన కారు ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన బాక్సర్ ప్రియా ఘంఘస్‌కు రాష్ట్రపతి అభినందనలు హెలిప్యాడ్ వద్ద సీఎం రేవంత్‌రెడ్డికి స్వాగతం పలికిన ఆకుల నరసన్న పటేల్ సిద్ధార్థ్ మల్హోత్రా 'ది వ్వాన్' మూవీ కలెక్షన్ల జోరు: రూ. 48 కోట్లు దాటిన వసూళ్లు విమానంలో పెను ప్రమాదం తప్పిన వైనం.. కాక్‌పిట్‌లో పైలట్, కో-పైలట్ మధ్య ఘర్షణ రహదారుల దుస్థితిపై ఎమ్మెల్యే పంచకర్ల సీరియస్.. ఆర్ అండ్ బి అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ పట్టివేత ప్రత్యేక అభియాన్ 6 కోసం ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ సన్నాహకాలు ముమ్మరం రూ.11.50 కోట్లతో రోడ్ల నిర్మాణం : శంకుస్థాపన చేసిన గంటా రేణిగుంట సబ్-డివిజన్ లో పోలీస్ యాక్ట్ అమలు.............డీఎస్పీ శ్రీనివాసరావు

బాబాయ్‌ హత్యతో అబ్బాయికే లాభం

Select Suryaa Now
బాబాయ్‌ హత్యతో అబ్బాయికే లాభం

జగన్‌ మౌనం పై మంత్రి నిమ్మల ప్రశ్నలు

ఏపీ స్టేట్‌ బ్యూరో, అమరావతి:

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్‌ యాదవ్‌ ఇచ్చిన వాంగ్మూలంపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. వివేకా హత్యతో అంతిమంగా లబ్ధి పొందింది జగన్‌, ఆయన కుటుంబ సభ్యులు, అవినాష్‌రెడ్డి అని సునీల్‌ యాదవ్‌ చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు.

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిమ్మల మాట్లాడారు. సునీల్‌ యాదవ్‌ కోర్టులో తనకు ప్రాణహాని ఉందని చెప్పినా తాడేపల్లి ప్యాలెస్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తనను కాకుండా అంతిమ లబ్ధిదారులైన జగన్‌, అవినాష్‌రెడ్డి కుటుంబ సభ్యులను విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని సునీల్‌ చెప్పినట్లు తెలిపారు.వివేకా హత్య కేసుతో సంబంధం ఉన్న పలువురు కీలక వ్యక్తులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడంపైనా మంత్రి ప్రశ్నలు లేవనెత్తారు. కసనూరు శ్రీనివాస్‌రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, కువైట్‌ గంగాధర్‌రెడ్డి, డ్రైవర్‌ నారాయణ, వైఎస్‌ అభిషేక్‌రెడ్డి, వాచ్‌మెన్‌ రంగయ్య తదితరుల మరణాలపై సమాధానాలు రావాల్సి ఉందన్నారు.

హత్యకు రూ.40 కోట్ల సుపారీ ఇచ్చినట్లు వచ్చిన అంశాన్ని కూడా నిమ్మల ప్రస్తావించారు. అంత పెద్ద మొత్తాన్ని ఇచ్చే ఆర్థిక సామర్థ్యం ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్‌రెడ్డికి లేదని.. రాజకీయంగా లబ్ధి పొందిన జగన్‌ కుటుంబానికే ఆ సామర్థ్యం ఉందని ఆరోపించారు. సుపారీకి సంబంధించిన నగదులో రూ.40 లక్షలను ఈడీ అటాచ్‌ చేసిందని చెప్పారు.హత్య జరిగిన రోజు తెల్లవారుజామునే వివేకానందరెడ్డి చనిపోయిన విషయం జగన్‌కు తెలిసినా.. సాయంత్రం వరకు పులివెందుల వెళ్లకుండా హైదరాబాద్‌లో ఎందుకు ఉన్నారని మంత్రి ప్రశ్నించారు. నాటి ముఖ్య సలహాదారు అజయ్‌ కల్లాం సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఘటనాస్థలంలో రక్తపు మరకలను తొలగించి, గుండెపోటుగా ప్రచారం చేయడం ద్వారా ఆధారాలను మార్చేందుకు ప్రయత్నించారని నిమ్మల ఆరోపించారు. గతంలో సీబీఐ దర్యాప్తు కోరిన జగన్‌.. ముఖ్యమంత్రి అయ్యాక విచారణను అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు.దస్తగిరి, సునీల్‌ యాదవ్‌ వాంగ్మూలాలు, దర్యాప్తు సంస్థల నివేదికలు, గూగుల్‌ టేక్‌అవుట్‌ ఆధారాలు, ఈడీ అటాచ్‌మెంట్లు కేసులో కీలకంగా ఉన్నాయని మంత్రి అన్నారు. నిందితులు తనపై ఆరోపణలు చేస్తున్నా జగన్‌ స్పందించకపోవడం ప్రజల్లో అనుమానాలు పెంచుతోందని పేర్కొన్నారు. ఇప్పటికైనా వివేకా హత్యపై జగన్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని నిమ్మల డిమాండ్‌ చేశారు.