BREAKING
సాండ్‌పేపర్ వివాదంపై డేవిడ్ వార్నర్ సంచలన ఆరోపణలు.. స్టార్క్, లయన్, హేజిల్‌వుడ్‌లను విచారించలేదంటూ క్రికెట్ ఆస్ట్రేలియాపై ఫైర్ 10వ తరగతి ఫలితాలు పై ప్రత్యేక దృష్టి టీ20 ఫార్మాట్‌లో వ్యూహాత్మక మార్పులే కీలకం.. కర్ణాటక యువ బ్యాటర్ స్మరన్ రవిచంద్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు దివ్య కుటుంబానికి అండగా ఉంగుటూరు ఎమ్మెల్యే, జనసేన నాయకులు యాదవోలులో కేంద్ర బృందం పర్యటన ఘనముగా గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం ఆర్థిక ప్రమాదాలను నివారించడానికి క్రమమైన వడ్డీ రేట్ల పెంపే ఉత్తమం జెన్సన్ హువాంగ్ లేకపోతే కీలక ఒప్పందాలను కోల్పోనున్న ఎన్విడియా 73 ఏళ్ల నిరీక్షనకు తెరదించుతూ న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సాధించిన వేల్స్ జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి అమెరికాలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం 1998 తర్వాత తొలిసారిగా అలాస్కాలో గెలుపొందిన డెమొక్రాటిక్ గవర్నర్ స్పేస్‌ఎక్స్ ఇంటర్నెట్ స్పీడ్ పరిమితులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర ఆగ్రహం జిల్లా ఆసుపత్రిలో డబ్బులు అడిగితే ఫోన్ చేయండి – ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండ శ్రీధర్ నశా ముక్త్ భారత్ బ్లాక్ స్థాయి క్రీడలు విజయవంతం

అయ్యగార్లపల్లిలో వృద్ధుడు ఉరివేసుకొని ఆత్మహత్య.

Select Suryaa Now
అయ్యగార్లపల్లిలో వృద్ధుడు ఉరివేసుకొని ఆత్మహత్య.

శెట్టూరు: ఒంటరితనం, అనారోగ్య సమస్యలతో మానసిక వేదనకు గురైన ఓ వృద్ధుడు వ్యవసాయ పొలంలో మృతి చెందిన ఘటన శెట్టూరు మండలం అయ్యగార్లపల్లి గ్రామ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ధర్మవరం పట్టణానికి చెందిన కాయల ఈరన్న (71), తండ్రి లక్ష్మన్న, గత రెండేళ్లుగా అయ్యగార్లపల్లి గ్రామానికి చెందిన శివశంకర్‌ వ్యవసాయ పొలంలో పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. భార్య సుమారు 12 సంవత్సరాల క్రితమే మృతి చెందడంతో అప్పటి నుంచి ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. వృద్ధాప్యంలో తోడుగా ఉండేవారు లేక ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ఈరన్న కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసుల ప్రకటనలో పేర్కొన్నారు. ఆరోగ్యం సహకరించకపోవడం, తన బాగోగులు చూసుకునేందుకు దగ్గరలో ఎవరూ లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందాడు. ఈ క్రమంలో శనివారం (నవంబర్ 14) ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో పొలంలో ఎవరూ లేని సమయంలో అక్కడి రేకుల షెడ్డులో ఉరివేసుకుని మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న మృతుడి కుమారుడు ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు శెట్టూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు శెట్టూరు పోలీస్‌ స్టేషన్‌ హెడ్ కానిస్టేబుల్ భవానీ ప్రసాద్ వెల్లడించారు.
శెట్టూరు రిపోర్టర్ :- ఖాసీం.