అత్యంత ఘనంగా కాబోయే మండలాధీశులు వెంకటరాజు జన్మదిన వేడుక!
అభిమానుల పూలమాలలతో హోరెత్తిన 'నల్లపరాజు' నివాసం
ఎస్.రాయవరం, నవంబర్ 15, మేజర్ న్యూస్:
ఎస్.రాయవరం మండలానికి కాబోయే మండలాధీశులు, యువ నాయకులు నల్లపరాజు వెంకటరాజు జన్మదిన వేడుకలు ఆదివారం ఆయన నివాసం కొత్త పోలవరంలో అత్యంత ఘనంగా జరిగాయి.వెంకటరాజు స్వగృహం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక పసుపు బెలూన్లు, పూలతో కళకళలాడింది. మండల పరిషత్ మాజీ అధ్యక్షులు ఏజెర్ల వినోద్ రాజు ఆధ్వర్యంలో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. వినోద్ రాజు చేతుల మీదుగా వెంకటరాజు కేక్ కట్ చేయగా, ఒక్కసారిగా వేదిక కరతాళ ధ్వనులతో మార్మోగింది. అభిమానులు, కూటమి పార్టీల నాయకులు భారీ పూలమాలలు, పూలదండలతో వెంకటరాజును ముంచెత్తారు. ఆప్యాయంగా శాలువాలు కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకకు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు అమలకంటి అబద్దం ముఖ్య అతిధిగా వ్యవహరించి యువతలో జోష్ నింపారు.
ఈ వేడుకలకు మండలం నలుమూలల నుండి అన్ని గ్రామాల నుంచి కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొత్త పోలవరం వేదిక అభిమాన జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వెంకటరాజు మండలంలో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని, భవిష్యత్తులో మండల అభివృద్ధికి ఆయన నాయకత్వం ఎంతో అవసరమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖుల్లో సాగి రామరాజు, గుర్రం రామకృష్ణ, ఏజెర్ల అనిల్ వర్మ, మీగడ సత్తిబాబు, కురందాసు శ్రీనివాస్, ముప్పిన శ్రీనివాసరావు తదితరులున్నారు.