BREAKING
మరోసారి తారక్‌తో జక్కన్న కాంబో: టాలీవుడ్‌‌లో హాట్ టాపిక్‌గా మారిన క్రేజీ ప్రాజెక్ట్ అంగన్వాడీకేంద్రాల్లోఘనంగాఉత్సవంకార్యక్రమం విద్వేషా దూషణలతో కాలక్షేపం చేస్తూ పరిపాలనను గాలికి వదిలేశారు..మాజీ మంత్రి పువ్వాడ ఆరోపణ. అక్టోబర్ 2న థియేటర్లలోకి విభిన్న కథాంశంతో వస్తున్న టాలీవుడ్ మూవీ ఇంప్యూర్ టోరెంట్ ఫార్మాపై మోతీలాల్ ఓస్వాల్ కవరేజ్ ప్రారంభం: 'న్యూట్రల్' రేటింగ్ కేటాయింపు.. కాలేజీనిసమర్ధవంతంగానిర్వహించినకరెస్పాండెంట్రాధాకృష్ణయ్య ఆజాద్ ఇంజనీరింగ్‌కు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రేటింగ్ అప్‌గ్రేడ్: దీర్ఘకాలిక వృద్ధి దృష్ట్యా పెరిగిన టార్గెట్ మండల స్థాయి కబడ్డీ పోటీల్లో కృష్ణవేణి పాఠశాల విద్యార్థుల విజయదుందుభి! గ్రామీణ ప్రాంతాల్లో చైన్ స్నాచర్ల హల్‌చల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో బీపీఎం రంగంలో భారీ మార్పులు: ప్రపంచ ఇంటెలిజెంట్ ఆపరేషన్స్ హబ్‌గా భారత్.. నాస్కామ్ వెల్లడి LT, HT విద్యుత్ కనెక్షన్లకు యూనిఫాం సర్వీస్ లైన్ ఛార్జీలు – పారదర్శకత, సరళత, వేగవంతమైన సేవలు ఆగస్టులో దేశీయ విమాన ప్రయాణికుల రాకపోకల్లో 7.5 శాతం తగ్గుదల: ఐఏటీఏ నివేదిక వెల్లడి పాపంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు అదనపు తరగతి గదులు నిర్మించాలి.. బదిలీపై వెళ్లిన ఎస్సీ సంక్షేమ శాఖ అధికారికి సన్మానం తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణుల ప్రభావం పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచన

అరసవల్లి అభివృద్ధికి రూ.55.74 కోట్లు

Select Suryaa Now
అరసవల్లి అభివృద్ధికి రూ.55.74 కోట్లు

 

- స్వదేశ్ దర్శన్ 2.0 కింద నిధుల మంజూరు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం, సెప్టెంబర్ 29 మేజర్ న్యూస్ : అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద రూ.55.74 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

అరసవల్లి కేవలం ఆలయం మాత్రమే కాదని.. శ్రీకాకుళం ఆధ్యాత్మికత, సంస్కృతి, చరిత్రకు ప్రతీక అని పేర్కొన్నారు. అరసవల్లిని ప్రముఖ ఆధ్యాత్మిక–పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో NDA ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఓ ప్రణాళికా బద్దంగా అమలుచేసుకుంటూ వెళ్తున్నామని తెలిపారు.

మంజూరైన నిధులతో భక్తులకు మెరుగైన మౌలిక వసతులు, పర్యాటక సౌకర్యాలు, కనెక్టివిటీతో పాటు అరసవల్లి సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సహకరించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శెకావత్ కు జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో అరసవల్లికి దేశవ్యాప్తంగా భక్తులు, పర్యాటకుల రాక మరింత పెరిగే అవకాశం ఉందని, అరసవల్లిని ప్రముఖ ఆధ్యాత్మిక–పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారంతో ముందుకు సాగుతామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ తదితరుల సహకారంతో అరసవల్లి ఆలయం మరింత అభివృద్ధి చెందేందుకు స్పష్టమైన కర్యచారనతో వెళ్తున్నామని అన్నారు. ప్రధాన ఉత్సవం రథసప్తమి వేడుకలను ప్రతీ ఏటా ఘనంగా నిర్వహించామని, లక్షలాది మంది భక్తులు అరసవల్లిని సందర్శించారని తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల సహకారంతో జిల్లాలో అభివృద్ధి దిశగా బలమైన అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు.