BREAKING
శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు. *శాంతియుత వాతావరణంలో దసరా, బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవలి* మధిర రూరల్ ఎస్.ఐ. విశ్వతేజ నాకు మా నాన్న కావాలి... చిన్నారి సమాధానానికి కదిలిన హృదయాలు వేగవరంలో సేవా సంకల్ప అభియాన్‌ మెడికల్ క్యాంపు దుర్గా పూజ వేళ అస్సాం తేయాకు కార్మికులకు శుభవార్త అన్నపూర్ణ దేవి అలంకరణలో అనఘా లక్ష్మీ అమ్మవారు. కుందుర్పి ప్రతినిధి *ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు, తల్లిదండ్రులు* స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో సల్బత్తాపూర్, మధ్వాపూర్ గ్రామాల్లో లోఓల్టేజ్ సమస్యకు పరిష్కారం ఎన్నికల వేళ రౌడీషీటర్లకు పోలీసుల హెచ్చరిక! ఉపాధి కూలీలకు స్నాక్స్ పంపిణీ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ పెద్దపల్లి ఎస్సైగా గుమ్ముల రాజశేఖర్‌ మాజీ కౌన్సిలర్ ఈశ్వర్ రాజు ను పరామర్శించిన ఎమ్మెల్సీ ఒకే రోజు 355 మందికి 1 కోటి 55 లక్షలుసీఎంఆర్ఎఫ్ సాయం. వైద్యానికి ఆర్థిక భరోసా కల్పించిన మంత్రి నిమ్మల విజ్ ఎయిర్ దూకుడు

అన్నపూర్ణదేవి శాకాంబరీ అలంకరణలో త్రిముఖదుర్గాదేవి

Select Suryaa Now
అన్నపూర్ణదేవి శాకాంబరీ అలంకరణలో త్రిముఖదుర్గాదేవి

సిఎస్ పురం,మేజర్ న్యూస్ : 

దేవీశరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పర్యాటక శైవక్షేత్రమైన భైరవకోనలో మూడవరోజు మంగళవారం అమ్మవారిని అన్నపూర్ణదేవి శాకాంబరీగా అలంకరణ చేసి పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా ఉదయం శ్రీత్రిముఖదుర్గభర్గులేశ్వరస్వామి,కాలభైరవేశ్వరస్వామి,నగరేశ్వరస్వామి ఇతర శివలింగాలకు దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ ముప్పాళ్ల శ్యామసుందరరాజు,కార్యనిర్వాహణాధికారి డి.వంశీకృష్ణారెడ్డి అధ్వర్యంలో దేవస్థానం అర్చకులు పంచామృత అభిషేకం పూజలు నిర్వహించి అనంతరం పట్టువస్త్రాలు పూలమాలలతో అలంకరణ చేసి పూజలను నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు భక్తులు పాల్గొని పూజలుచేసి తీర్ధప్రసాదాలు స్వీకరించారు.అనంతరం దేవస్థానం ఆవరణలో ప్రత్యేకంగా అలంకరించిన మండపం నందు త్రిముఖదుర్గాదేవిని అన్నపూర్ణ,శాకాంబరీదేవిగా అలంకరణ చేసి ఉభయదాతలచే వివిధ హోమపూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించి హారతులు ఇచ్చారు.ఈసందర్భంగా పలువురు ఉభయదాతలు పూజల్లో పాల్గొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.దసరా ఉత్సవాల సందర్భంగా దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ ముప్పాళ్ల శ్యామసుందరరాజు,ఈఓ డి.వంశీకృష్ణారెడ్డి అధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక వసతులు కల్పించారు.ఈకార్యక్రమంలో దేవస్థానం అర్చకుల బృందం, సిబ్బంది, భక్తులు, పర్యాటకులు పాల్గొన్నారు.