BREAKING
సొంత నిధులతో ఆడపడుచులకు బతుకమ్మ కానుక.. సర్పంచ్ రాజు ఔదార్య వంగర ఎస్ఐ గా మెరుగు రాజు బాధ్యతల స్వీకరణ విద్యుత్ కోతలపై ప్రజలకు సమాధానం చెప్పాలి.. నడకే దివ్య ఔషధం.. ఆరోగ్యానికి ఆయువుపట్టు.... ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ సూర శ్రీనివాసరావు చిన్న పిల్లల దసరా వేడుకలు.. చిన్ననాటి జ్ఞాపకాల గుర్తు చేసుకున్న కలెక్టర్ అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు పలాస, ఇచ్ఛాపురం మునిసిపల్ ఎన్నికల నిర్వహణపై ఫేజ్–1 శిక్షణ సమావేశం వికారాబాద్ నియోజకవర్గానికి రూ.5.90 కోట్ల నిధులు.. మూడు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి జీవోలు జారీ 'మిస్టర్ ఇండియా' పోటీల్లో సత్తా చాటిన ధిల్లేశ్వరరావు.... ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే గొండు శంకర్ దుర్గామాతను దర్శించుకున్న మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి నంగునూరు ఉద్యోగుల సంక్షేమ సంస్థ నూతన కార్యవర్గం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన పాలకొండ సబ్-కలెక్టర్ డైరెక్టర్ల ఎన్నిక ఏకగ్రీవం హుస్నాబాద్‌ పురపాలక సంఘంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

అన్నపూర్ణా దేవిగా విశ్వ దుర్గేశ్వరి అమ్మ వరి కంకులు దండలుగా కట్టి ఆలయం అలంకరణ

Select Suryaa Now
అన్నపూర్ణా దేవిగా విశ్వ దుర్గేశ్వరి అమ్మ  వరి కంకులు దండలుగా కట్టి ఆలయం అలంకరణ

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, తాడేపల్లిగూడెం పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో 17వ వార్డు, విశ్వదుర్గేశ్వరి పేటలో శ్రీ విశ్వ దుర్గేశ్వరి అమ్మవారి ఆలయం నందు ఐదవ రోజు శ్రీ విశ్వ దుర్గేశ్వరి అమ్మవారిని అన్నపూర్ణా దేవిగా తీర్చిదిద్దారు. అమ్మవారి ఆలయాన్ని ఎంతో సుందరంగా వరి కంకులు దండలుగా కట్టి ఆలయం మొత్తాన్ని అలంకరించి, ఆలయ ప్రాంగణం, అమ్మవారి ఆలయాన్ని పచ్చటి పైరు, వరి కంకులు నెలకొల్పి అలంకరించి  వచ్చిన భక్తులందరికీ అమ్మ తీర్థ ప్రసాదాలు అందించారు. పచ్చటి వరి పొలాలలో అమ్మవారి దర్శనం ఇస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. కూనిరెడ్డి ప్రసాద్ విమల దంపతులు యాండ్రపు శ్రీనివాస్, రామలక్ష్మి దంపతులచే ప్రత్యేక పూజ కార్యక్రమాలు, హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు, భవానీలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

 రిపోర్టర్ శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పశ్చిమగోదావరి జిల్లా