దువ్వూరు విజయకుమార్ రెడ్డిని పరామర్శించిన మాజీ నల్లపరెడ్డి..
నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ : విడవలూరు మండలం, ముదివర్తి గ్రామంలో ఇటీవల గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న అలాగనిపాడు గ్రామ వైసీపీ అధ్యక్షులు గండవరపు వివేకానంద రెడ్డి గారి మామగారు దువ్వూరు విజయకుమార్ రెడ్డి గారిని మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా విజయకుమార్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వారి యోగక్షేమాలను విచారించారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొండూరు వెంకట సుబ్బారెడ్డి, కొండూరు అనిల్ బాబు, కాటంరెడ్డి నవీన్ రెడ్డి, కొండూరు లక్ష్మీనారాయణ రెడ్డి, తిక్కవరపు జనార్దన్ రెడ్డి, మాజీ ఎంపీపీ కాయల సౌందర్య, అనపల్లి ఉదయభాస్కర్, షేక్ బాబులు, అడపాల, మహేందర్ రెడ్డి, వేగూరు వెంకయ్య, చీకిడి మోహన్ వేగూరు సుబ్రహ్మణ్యం, శీలు రవి మరియు తదితరులు పాల్గొన్నారు.