అంతర్గత రహదారులకు సీసీ రోడ్ల శంకుస్థాపన
వేలేరుపాడు, సూర్య న్యూస్ : పెద్ద గోతులుగా ఏర్పడిన అంతర్గత రహదారులకు సీసీ రోడ్లను కూటమి ప్రభుత్వం మంజూరు చేయడంతో మండలంలోని 4 గ్రామ పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాలలో కోటి డెబ్భై లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లను మంగళ వారం టీడీపీ మండల అధ్యక్షులు అమరవరపు అశోక్,కార్యదర్శి కట్టం రాంబాబు ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు.రేపాక గొమ్ము గ్రామ పంచాయతీ పరిధిలోని రోడ్లకు 40 లక్షలు, తాట్కూరు గొమ్ము గ్రామ పంచాయతీ రోడ్లకు 60 లక్షలు,రామవరం గ్రామ పంచాయతీ రోడ్లకు 50 లక్షలు, మేడే పల్లి గ్రామ పంచాయతీ రోడ్లకు 20 లక్షల నిధులతో ఈ రోడ్లను శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సంజీవీలు,నూప శ్రీరాములు,ఎండి నయీం,కుక్కునూరు రాంబాబు,సత్తిబాబు,శివరాం,వంశీ,భాను,అనిల్, సీపీఐ నాయకులు సన్నెపల్లి సాయి బాబు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ మొహిద్దీన్, వేలేరుపాడు మండలం, ఏలూరు జిల్లా