BREAKING
శ్రీ శ్రీ జగదాంబ అమ్మవారుకి పట్టు చీర సమర్పించిన చాట్రాతి కుటుంబ సభ్యులు కేతగుడిపిలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ.. టీడీపీలోకి 45 కుటుంబాలు!* బేతపూడి - రావి అనంతవరం బీటీ రహదారిని ప్రారంభించిన మంత్రులు దుద్దెడ శంభులింగేశ్వర క్షేత్ర కోనేరు పునర్నిర్మాణానికి సన్నాహాలు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్.చెక్కులు పంపిణీ ఖమ్మంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శన ప్రారంభం నందివాడ మండలంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు: తొలిరోజు 'బాలాత్రిపురసుందరి'గా అమ్మవార్ల దర్శనం స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధత గంధ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బి. ఎన్ సోషల్ మీడియా సమాచారపై జాగ్రత్తగా ఉండాలి:* ఎస్ఐ మహేష్ ఎల్‌నినో ప్రభావంపై.. రైతులకు అవగాహన కార్యక్రమం దశాబ్దాల నిరీక్షణకు తెర... 939 పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు శ్రీ కంచి కామాక్షి ఆలయంలో ప్రత్యేక పూజలు యువత స్వయం కృషితో ఎదగాలి కొడంగల్‌లో ఆశా వర్కర్ల ధర్నా.. దోమ పోలీస్‌ స్టేషన్‌కు తరలింపు

అమ్మ ఉత్సవాలు విజయవంతం చేయండి-సీఎం

Select Suryaa Now
అమ్మ  ఉత్సవాలు విజయవంతం  చేయండి-సీఎం

 

ఏపీ స్టేట్ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి

విజయవాడ దుర్గగుడిలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలను గ్రాండ్ సక్సెస్ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. దేవాదాయ శాఖ, పర్యాటక శాఖ, జిల్లా యంత్రాంగం కలిసి పనిచేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు తరలివస్తున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. విఐపిల రాక కారణంగా సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దసరా సామాన్యుల దసరాగా ఉండాలి....విఐపి దసరాగా కాదు...అన్ని వర్గాలు దీనికి సహకరించాలి. ఉన్నత స్థాయిలో అధికారులు తీసుకునే నిర్ణయాలకు అంతా సహకరించాలని సీఎం సూచించారు. దర్శనాలు, సౌకర్యాలకు సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని సీఎం అన్నారు. విఐపిల రాక కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తే...ఆ సమయంలో ప్రజలు, వాహనదారుల ఇబ్బందులు తగ్గించే వ్యూహాలను అమలు చేయాలని సీఎం సూచించారు. మరోవైపు టూరిజం శాఖ కూడా విజయవాడ ఉత్సవ్ 2.0ను విజయవంతం చేయాలని చెప్పారు. మన సంస్కతీ, సాంప్రదాయాలు చాటేలా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ ను ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించాలన్నారు. దసరా సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొనేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులు, పర్యాటకులు, ప్రజలతో ఈ ప్రాంతంలో ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుతుందని సిఎం అన్నారు. దానికి అనుగుణంగా ఏర్పాట్లు జరగాలన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దుర్గమ్మ దర్శనానికి, సరస్ మేళాకు హాజరవుతున్న నేపథ్యంలో ఆమె పర్యటనపైనా చర్చించారు. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఉత్పత్తులు ప్రదర్శించేలా 'జాతీయ సరస్ మేళా–2026'ను విజయవాడలోని పున్నమి ఘాట్‌లో అక్టోబర్ 13 నుంచి 31 వరకు నిర్వహిస్తున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చే మహిళా పారిశ్రామికవేత్తల కోసం 576 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మన రాష్ట్రం నుంచి 208 స్టాళ్లు మేళాలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ ఎస్‌హెచ్‌జి మహిళలు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు 'స్వయం ఏపీ' బ్రాండ్ కింద తమ ఉత్పత్తులను జాతీయ స్థాయిలో ప్రదర్శించి, విక్రయించేందుకు ఈ మేళా వేదిక కావాలని  సిఎం అన్నారు. సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ సమీక్షలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్ తో పాటు ఆయా శాఖ అధికారులు, ఎన్టీఆర్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఎం.గణేశ్, సూర్య ప్రధాన ప్రతినిధి, ఏపీ