BREAKING
ఆధునిక సాంకేతికతతో విద్యుత్ రంగం, సరికొత్త ప్రగతికి సంకేతం. రీ సర్వే తో భూమి సమస్యల పరిష్కారం - ఖమ్మం జిల్లా కలెక్టర్ కోటేకల్‌లో ఘనంగా శ్రీరామ హృదయ కలశం ఊరేగింపు బుల్లెట్ దేవి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు. చిన్న తగదాలతో కోర్టులను ఆశ్రయించవద్దు మంగళగిరి నియోజకవర్గం మెల్లెంపూడిలో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు క్విజ్ లో గోకవరం విద్యార్థి కి ప్రథమ స్థానం వైసీపీ గెలుపుకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి భోగాపురంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు మురుగు నీటితో ఇల్లందు ప్రజల అవస్థలు నాలుగు మధ్య షాపులకు టెండర్లు ఖరారు అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మెగా వైద్య శిబిరం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి వైయస్సార్సీపీ నేత వడ్డీ రఘురాం సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా, దసరా అడ్వాన్స్ ఇవ్వాలి - రావిపాడు లో జల్ జీవన్ మిషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ బొలిశెట్టి

అంగన్వాడీ ముగింపు వారోత్సవాలు ఘనం

Select Suryaa Now
అంగన్వాడీ ముగింపు వారోత్సవాలు ఘనం

 చిన్నతనం నుంచే పిల్లల్లో నైతిక విలువలు, మంచి అలవాట్లు పెంపొందించాలి..   కావలి అంగన్వాడీ సూపర్వైజర్ వి. హైమావతి.

​కావలి మేజర్ న్యూస్ :  నగరంలోని వెంగళ్ రావు నగర్ అంగన్వాడీ కేంద్రంలో 9వ రాష్ట్రీయ పోషణ్ మాస ఉత్సవాలు మరియు అంగన్వాడీ వార్షిక ఉత్సవ ముగింపు కార్యక్రమం బుధవారం నాడు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అంగన్వాడీ సూపర్వైజర్ వి. హైమావతి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.
​ఈ సందర్భంగా సూపర్వైజర్ వి. హైమావతి మాట్లాడుతూ... చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి అంగన్వాడీ కేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. పిల్లలు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి పోషక విలువలు అధికంగా ఉండే ఆహారాన్ని ప్రతిరోజూ అందించాలని తల్లిదండ్రులకు సూచించారు.
​అలాగే పిల్లల మనస్సుల్లో చెడు ఆలోచనలు, చెడు తలంపులకు తావులేకుండా, ఆటపాటలు మరియు వినోదాత్మక కార్యక్రమాల ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని పేర్కొన్నారు. నేటి డిజిటల్ యుగంలో పిల్లలు సెల్ ఫోన్లకు బానిసలు కాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందన్నారు. మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచి, శారీరక శ్రమతో కూడిన ఆటలు ఆడేలా ప్రోత్సహించాలని కోరారు. సమాజంలో గురువులను, పెద్దలను ఏ విధంగా గౌరవించాలో చిన్నతనం నుంచే నేర్పించాలని, మంచి నైతిక విలువలతో కూడిన విద్యను అందించి వారిని ఉన్నత స్థాయికి చేర్చాలని ఆమె క్షుణ్ణంగా వివరించారు.
​ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు వై. సావిత్రి, రజిని, సుజాత, రాజేశ్వరిలతో పాటు స్థానిక మహిళలు, చిన్నారులు, అంగన్వాడీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.