గుంటూరు జిల్లా ఎస్పీకు అంబటి రాంబాబు కితాబు
గుంటూరు మేజర్ న్యూస్...
గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలో గుంటూరు నగరంలో ఇప్పటివరకు నామినేషన్ల పర్వం ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగిందని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు కితాబిచ్చారు.గుంటూరులో మీడియాతో మాట్లాడిన అంబటి ఎన్నికలలో పోలీసు అధికారుల తీరుపై విమర్శలు సంధించారు. పల్నాడు జిల్లా ఎస్పీ, ఐజీ పచ్చ చొక్కాలు వేసుకున్నట్లు ప్రవర్తిస్తున్నారని అన్నారు.పోలీసులే అధికార పార్టీ కార్యకర్తల మాదిరిగా తమ పార్టీ అభ్యర్థులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఖచ్చితంగా తాము అధికారంలోకి వచ్చాక బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.