BREAKING
ఆధునిక సాంకేతికతతో విద్యుత్ రంగం, సరికొత్త ప్రగతికి సంకేతం. రీ సర్వే తో భూమి సమస్యల పరిష్కారం - ఖమ్మం జిల్లా కలెక్టర్ కోటేకల్‌లో ఘనంగా శ్రీరామ హృదయ కలశం ఊరేగింపు బుల్లెట్ దేవి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు. చిన్న తగదాలతో కోర్టులను ఆశ్రయించవద్దు మంగళగిరి నియోజకవర్గం మెల్లెంపూడిలో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు క్విజ్ లో గోకవరం విద్యార్థి కి ప్రథమ స్థానం వైసీపీ గెలుపుకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి భోగాపురంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు మురుగు నీటితో ఇల్లందు ప్రజల అవస్థలు నాలుగు మధ్య షాపులకు టెండర్లు ఖరారు అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మెగా వైద్య శిబిరం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి వైయస్సార్సీపీ నేత వడ్డీ రఘురాం సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా, దసరా అడ్వాన్స్ ఇవ్వాలి - రావిపాడు లో జల్ జీవన్ మిషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ బొలిశెట్టి

ఫిష్‌మీల్ లభ్యతపై న్యూఢిల్లీలో ఎంపీ బీద కీలక సమావేశం

Select Suryaa Now
ఫిష్‌మీల్ లభ్యతపై న్యూఢిల్లీలో ఎంపీ బీద కీలక సమావేశం

నెల్లూరు సిటీ మేజర్ న్యూస్  :  ఆక్వాకల్చర్ రంగానికి అవసరమైన ఫిష్‌మీల్ దేశీయంగా తగినంతగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం, పెరుగుతున్న ధరలను నియంత్రించడం, రైతులు మరియు రొయ్యల దాణా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం న్యూఢిల్లీలో జరిగిన కీలక సమావేశంలో శ్రీంప్ ఫీడ్ మణు్ఫాక్చరర్స్ అసోసియేషన్ (SFMA) తరఫున  బీద మస్తాన్ రావు యాదవ్, ఎంపీ, రాజ్యసభ మరియు చైర్మన్, BMR గ్రూప్ మరియు అల్లూరి ఇంద్రకుమార్, చైర్మన్, అవంతి గ్రూప్  పాల్గొన్నారు.  దేశంలో ఉత్పత్తి అవుతున్న ఫిష్‌మీల్‌లో 85 శాతానికి పైగా ఎగుమతి అవుతుండటంతో దేశీయ ఫీడ్ పరిశ్రమకు లభ్యత తగ్గి, ధరలు భారీగా పెరుగుతున్నాయని SFMA ప్రతినిధులు వివరించారు. ఫిష్‌మీల్ ధరల పెరుగుదల నేరుగా ఫీడ్ తయారీ వ్యయాన్ని, తద్వారా రొయ్యల రైతుల సాగు వ్యయాన్ని పెంచుతూ వారి లాభదాయకతపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముడిసరుకు ధరల పెరుగుదల ఫీడ్ తయారీదారుల ఉత్పత్తి వ్యయాలను గణనీయంగా పెంచిందని కేంద్రానికి నివేదించింది.  దేశీయ ఆక్వాఫీడ్ పరిశ్రమకు ప్రాధాన్యతతో ఫిష్‌మీల్ సరఫరా, అవసరమైనప్పుడు ఎగుమతులపై తాత్కాలిక నియంత్రణ/కోటా విధానం, ధరలు–సరఫరాపై పర్యవేక్షణ వంటి తక్షణ విధానపరమైన చర్యలు తీసుకోవాలని SFMA ప్రతినిధులు కోరారు.  రైతుల ప్రయోజనాలను కాపాడుతూ ఫీడ్ ధరలను అందుబాటులో ఉంచేందుకు, దేశీయ ఆక్వాకల్చర్ రంగం మరియు సుమారు USD 5 బిలియన్ విలువైన రొయ్యల ఎగుమతి రంగం పోటీతత్వాన్ని పరిరక్షించేందుకు ఫిష్‌మీల్ దేశీయ లభ్యతను నిర్ధారించడం అత్యవసరమని బీద మస్తాన్ రావు యాదవ్ మరియు శ్రీ అల్లూరి ఇంద్రకుమార్ స్పష్టం చేశారు.