BREAKING
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలసిన కార్పొరేటర్ షాహినా. ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ సదాశివపల్లిలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన పరిషత్ ఎన్నికల ప్రచారం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఓటు హక్కును నిలబెట్టుకుందాం! ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీ కలిసిన కార్పొరేటర్ శంకర్ యాదవ్. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో సరళ ఫిజిక్స్ కాన్‌క్లేవ్`2026 కొమ్మరపూడి నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ ఆందోళన! టవర్ లైట్స్ కి శంకుస్థాపన అగ్ని ప్రమాదంలో బస్సు దగ్ధం చంద్రబాబును కలిసిన కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ ఏపిలగుంటలో పొడమేకల ముమ్మర ప్రచారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై లారీలు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు! భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనగా నిర్వహించిన గ్రామ సర్పంచ్

అక్కివలస గ్రామ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా..

Select Suryaa Now
అక్కివలస గ్రామ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా..

 

– సారవకోట మండల టీడీపీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ.

సారవకోట, నవంబర్ 26 మేజర్ న్యూస్: అక్కివలస గ్రామ అభివృద్ధికి తన వంతు సంపూర్ణ సహకారం అందించి, గ్రామంలో నెలకొన్న ప్రధాన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని సారవకోట మండల టీడీపీ అధ్యక్షులు, ఎంపీటీసీ ప్రతినిధి కత్తిరి వెంకటరమణ హామీ ఇచ్చారు.

ఈ మేరకు గురువారం విశాఖపట్నంలోని కార్‌షెడ్ ప్రాంతంలో సింగుపురపు జోగారావు నివాసానికి వెళ్లిన కత్తిరి వెంకటరమణ గ్రామ పెద్దలు , స్థానికులతో అయనను కలిశారు. ఈ సందర్భంగా గుమ్మపాడు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన తల్లి కత్తిరి సింహాద్రమ్మ గెలుపునకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం అక్కివలస గ్రామంలో నెలకొన్న ప్రధాన సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా గ్రామానికి స్మశానవాటిక ఏర్పాటు, రహదారుల అభివృద్ధితో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని గ్రామ పెద్దలు కోరారు.

దీనిపై కత్తిరి వెంకటరమణ స్పందిస్తూ సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ, స్థానిక ఎమ్మెల్యే, కేంద్ర మంత్రి, సంబంధిత ప్రభుత్వ అధికారుల సమన్వయంతో గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులు, సహకారం సమకూర్చేందుకు కృషి చేస్తానన్నారు. రానున్న రెండు నెలల నుంచి ఏడాది లోపు గ్రామంలోని సమస్యలను దశలవారీగా పరిష్కరించి, అభివృద్ధి పనులను కచ్చితంగా పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు హనుమంతు వెంకటరమణ మూర్తి, హనుమంతు లక్ష్మీనారాయణ, హనుమంతు చిన్ని కృష్ణ, హనుమంతు చంద్రశేఖర్, ఇలపండి లక్షణరావు, బీసింగి పున్నయ్య, జలుమూరు యర్రయ్య, బోరిగి పూర్ణచంద్రరావు, మెండ లక్ష్మణరావు, గోజ్జ భీమారావు, సోల ధర్మారావు, గోద్దు రాజేష్, శిమ్మ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.