ఐటీడిఎ పీఓ దృష్టికి ఒండ్రుజోల సమస్యలు.
ఎమ్మెల్యే గోవిందరావు, ఎంపిహెచ్ డవలపర్స్ అధినేత
బామిడి రాజు పీఓ కు విజ్ఞప్తి.
కొత్తూరు సెప్టెంబర్ 30(మేజర్ న్యూస్)కొత్తూరు మండలం ఒండ్రుజోల పంచాయితీ లో గత కొంతకాలంగా పరిష్కారం కానీ సమస్యలను పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తో సామాజిక వేత్త యం పిహెచ్ డవలపర్స్ అధినేత బామిడి రాజు, సీతంపేట ఐటీడిఎ ప్రాజాక్టు అధికారి స్వప్నిల్ పవార్ జగన్నాద్ ను కలసి వివరించారు. గిరిజనులు ఒండ్రుజోల గ్రామం లో బాగా వెనుక బడి ఉన్నారని వారి అభివృద్ధి కి చర్యలు తీసుకోవాలని వారు పీఓ ని కోరారు.అదేవిధంగా ఒండ్రుజోల బద్దె చెరువు అభివృద్ధి కి నిధులు మంజూరు చేసి చెరువు సుందరీకరణ కు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ద్వారా బామిడి రాజు ప్రాజాక్టు అధికారిని కోరారు. గ్రామాభివృద్ధికి పీఓ తో ఎమ్మెల్యే గోవిందరావు,బామిడి రాజు హార్చించారు.గ్రామాభివృద్ధికి చర్యలు తీసుకొంటానని పీఓ హామీ ఇచ్చినట్లు రాజు అనుచరులు పేర్కొన్నారు.