అధికారులు , రాజకీయ ప్రముఖులతో 'దేశం' నేత నాయుడు నివాసం
నరసాపురం, సూర్య న్యూస్: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, కొవ్వలి ఫౌండేషన్ ఛైర్మన్ కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు నివాసం రాజకీయ ప్రముఖులు, అధికారులతో కితకితలడింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో కీలకమైన నేతలు, నాయుడు నివాసానికి చేరుకుంటున్నారు. నర్సాపురం నియోజకవర్గం లో కూటమి పార్టీల అభ్యర్థులు గెలుపుకు కృషి చేసే బాధ్యత నాయుడు భుజాలపై వేసినట్లు తెలిసింది. మంగళవారం కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ప్రభుత్వ విప్ , నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, నర్సాపురం డీఎస్పీ సుధాకర్ ,టీడీపీ నరసాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పొత్తూరి రామరాజు, ఆర్డీవో దాసి రాజు తదితరులు కొవ్వలి స్వగృహానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా విచ్చేసిన ప్రముఖులకు కొవ్వలి రామ్మోహన్ నాయుడు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించి సాదర స్వాగతం పలికారు. అనంతరం వారందరికీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో పాల్గొన్నారు. విందు ముగిసిన అనంతరం నేతల మధ్య కీలక రాజకీయ భేటీ జరిగింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణ, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నరసాపురం నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి చేపట్టాల్సిన ప్రాజెక్టులు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నరసాపురం పట్టణాన్ని, పరిసర ప్రాంతాలను మరింతగా అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా నేతలు నిర్ణయించారు.
రిపోర్టర్ ఇజ్రాయిల్ నరసాపురం పశ్చిమగోదావరి జిల్లా