ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు
*జిల్లా ఉద్యానవన శాఖ అధికారి వెల్లడి
పూసపాటిరేగ, సెప్టెంబర్ 30, మేజర్ న్యూస్: ఆయిల్ ఫామ్ సాగు ద్వారా అధిక దిగుబడులను సాధించవచ్చునని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి చిట్టిబాబు అన్నారు. మండలం లోని గోవిందపురం గ్రామంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించడం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖ అధికారులు, పతంజలి ఆయిల్‌పామ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొని రైతులకు శాస్త్రీయ సాగు పద్ధతులు, పంట యాజమాన్య పద్ధతులు మరియు ప్రభుత్వ ప్రోత్సాహకాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్, పెద్దపేటకు చెందిన శాస్త్రవేత్త డా. రాజశేఖర్ గారు రైతులకు ఆయిల్‌పామ్ సాగులో అనుసరించాల్సిన శాస్త్రీయ పద్ధతులు, మొక్కల ఎంపిక, నాటే విధానం, ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం మరియు సమగ్ర పంట యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. ఆయిల్‌పామ్ సాగులో సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.
జిల్లా ఉద్యాన శాఖ అధికారి కె. చిట్టిబాబు మాట్లాడుతూ, సంప్రదాయ వ్యవసాయ పంటలతో పాటు ఆయిల్‌పామ్ వంటి దీర్ఘకాలిక ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా రైతులు స్థిరమైన ఆదాయం పొందేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఉద్యాన శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాలు, రాయితీలు మరియు రైతులకు అందుబాటులో ఉన్న సహాయ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు
భోగాపురం మండల ఉద్యాన అధికారి బి. ఉమాభారాణి మాట్లాడుతూ, ఆయిల్‌పామ్ సాగు విస్తరణ, అంతర పంటల సాగు పంట ప్రారంభ దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటల సాగు ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని, శాఖ ద్వారా అందిస్తున్న ప్రోత్సాహకాలను రైతులు వినియోగించుకోవాలని తెలిపారు.
రైతులు పాటించాల్సిన ముందస్తు జాగ్ర
పతంజలి ఆయిల్‌పామ్ కంపెనీ మేనేజర్ గురునరసయ్య ఆయిల్‌పామ్ సాగులో కంపెనీ అందిస్తున్న సహకారం, మొక్కల సరఫరా, సాగు విధానాలు మరియు రైతులకు అందుబాటులో ఉన్న సేవల గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ సిబ్బంది, గ్రామ ఉద్యాన సహాయకులు, రైతులు మరియు పతంజలి ఆయిల్‌పామ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. రైతులు శాస్త్రవేత్తలతో తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.