BREAKING
దీపావళి వేడుకలకు వెళ్లలేకపోయిన రిషి కపూర్.. అత్తగారు కవర్ చింపేసిన ఆసక్తికర ఘటన గుర్తుచేసుకున్న నీతూ కపూర్ సిద్దిపేట సభ ఏర్పాట్ల సమావేశంలో కాట శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు సర్పంచ్ ఎన్నికల వేడి.. సీట్ల కోసం కూటమిలో కుమ్ములాటలు! ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సీనియర్ నటుడు, దర్శకుడు టిన్ను ఆనంద్.. ఆరోగ్యంపై అప్‌డేట్ నాకు నచ్చిన పాత్రలు దొరకడం ఇప్పటికీ సవాలే.. సరైన అవకాశం కోసం వేచి చూస్తా: అదితి రావు హైదరి పోటీ నుంచి తప్పుకున్న రాంజీ యశ్ రాజ్ ఫిల్మ్స్ తొలి హారర్ చిత్రంలో వరుణ్ ధావన్.. దర్శకత్వం ఎవరిదంటే? రెండు ద్విచక్ర వాహనాలు డి... ఒకరు మృతి న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌కు గుర్నూర్ బ్రార్ ఎంపిక.. కుల్దీప్ యాదవ్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం సాండ్‌పేపర్ వివాదంపై డేవిడ్ వార్నర్ సంచలన ఆరోపణలు.. స్టార్క్, లయన్, హేజిల్‌వుడ్‌లను విచారించలేదంటూ క్రికెట్ ఆస్ట్రేలియాపై ఫైర్ 10వ తరగతి ఫలితాలు పై ప్రత్యేక దృష్టి టీ20 ఫార్మాట్‌లో వ్యూహాత్మక మార్పులే కీలకం.. కర్ణాటక యువ బ్యాటర్ స్మరన్ రవిచంద్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు దివ్య కుటుంబానికి అండగా ఉంగుటూరు ఎమ్మెల్యే, జనసేన నాయకులు యాదవోలులో కేంద్ర బృందం పర్యటన

ఆత్మకూరు మూడవ వార్డు బీజేపీ కౌన్సిలర్ నలిశెట్టి శ్రీనివాసులుకు ఘన అభినందనలు

Select Suryaa Now
ఆత్మకూరు మూడవ వార్డు బీజేపీ కౌన్సిలర్ నలిశెట్టి శ్రీనివాసులుకు ఘన అభినందనలు

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :  ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల్లో మూడవ వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అఖండ విజయం సాధించిన నలిశెట్టి శ్రీనివాసులును శనివారం బీజేపీ, ఎన్డీఏ కూటమి నాయకులు ఆయన స్వగృహంలో కలిసి ఘనంగా అభినందించారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయ రెడ్డి తో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని శ్రీనివాసులుకు శుభాకాంక్షలు తెలియజేసి, స్వీట్లు పంపిణీ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో మున్సిపాలిటీలో తనదైన శైలిలో ప్రజాసేవ చేస్తూ, మూడవ వార్డు అభివృద్ధికి కృషి చేసి మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు.అనంతరం కౌన్సిలర్ నలిశెట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ, మూడవ వార్డులోని సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. తన విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలందరికీ, ముఖ్యంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి పేరు నిలబెట్టే విధంగా ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కుడుముల సుధాకర్ రెడ్డి, కరటంపాటి సుధాకర్, పలువురు నాయకులు పాల్గొన్నారు.