BREAKING
జర్నలిస్టులపై అణచివేత...భారత ప్రభుత్వ తీరుపై మీడియా సంస్థల తీవ్ర ఆరోపణలు సన్నీ డియోల్ ‘సూర్యా’ ఫస్ట్ లుక్.. నెట్టింట తెగ వైరల్ అవుతున్న రగ్డ్ లుక్! బుచ్చిలో వైసీపీ మైనారిటీలకు పెద్దపీట.. చైర్ పర్సన్ గా షేక్ షకీలా బేగం.. కాంగ్రెస్ మాటల చేతలకు పొంతన లేదు :0పెరమోని నరేష్ యాదవ్ 25 మంది వృద్ధులకు అన్నదానం రబిలో ఆరుతడి పంటలే మేలు! గ్రైండర్ డేటా షేరింగ్ వివాదం...మైక్రోసాఫ్ట్ 'జాండర్' సంస్థకు నార్వే భారీ జరిమానా ఈవోని కలిసిన దేవస్థాన కమిటీ సభ్యుడు బీజేవైఎం నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులుగా మణి మోదీ వెంకటేశ్వర దేవాలయం కు ఎమ్మెల్యే శంఖు స్థాపన అన్నపూర్ణా దేవి అలంకారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు పొదలకూరు దశ, దిశ మారుస్తోన్న సోమిరెడ్డి ప్రకృతి విధ్వంసానికి కారణమవుతున్న ప్రోత్సాహకాలే అసలు సమస్య కాశీబుగ్గ డీఎస్పీగా జీవీ రమణ బాధ్యతల స్వీకరణ. సెలవుల్లో కంప్యూటర్‌ పాఠాలు

ఆర్థరైటిస్‌పై అవగాహనతో కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

Select Suryaa Now
ఆర్థరైటిస్‌పై అవగాహనతో కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్  :   జేమ్స్ గార్డెన్‌లోని భాస్కర్ ఆర్థోపెడిక్ హాస్పిటల్‌లో కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ది పి.ఎం.పి. అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో సోమవారంనాడు ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ కొణతం భాస్కర్ మాట్లాడుతూ.... ఆర్థరైటిస్ (కీళ్ల వాతం) వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు, చికిత్సా విధానాలు, కీళ్ల ఆరోగ్య పరిరక్షణపై పిఎంపి సిటీ సభ్యులకు, రోగులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఆర్థరైటిస్ అనేది కీళ్లలో నొప్పి, వాపు, బిగుతుదనం, కదలికల్లో ఇబ్బందులకు కారణమయ్యే వ్యాధుల సమూహంఅని అన్నారు. ముఖ్యంగా వయస్సు పెరిగేకొద్దీ కొందరిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని, అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి కొన్ని రకాల వ్యాధులు చిన్న వయస్సులో కూడా రావచ్చు అని, వ్యాధి రకాన్ని బట్టి లక్షణాలు, చికిత్స మారుతూ ఉంటాయన్నారు.  ఆర్థరైటిస్ ముఖ్య లక్షణాలు: కీళ్లలో నొప్పి, వాపు ఉండటం, ఉదయం నిద్రలేచినప్పుడు కీళ్లు బిగుసుకుపోవడం, నడవడం, మెట్లుఎక్కడం, కూర్చోవడం, లేవడంలో ఇబ్బంది కలగడం, చేతివేళ్లు, మోకాళ్లు, భుజాలు వంటి కీళ్ల కదలికలు తగ్గిపోవడం, కొన్ని సందర్భాల్లో కీళ్ల వద్ద వేడి, ఎరుపుదనం కనిపించడం లాంటి సమస్యలు కొత్తన్నమవుతాయని తెలిపారు. ఆర్థరైటిస్ సమస్యను తగ్గించుకోవడానికి ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ప్రతిరోజూ ఆరోగ్యానికి తగిన విధంగా నడక, తేలికపాటి వ్యాయామాలు చేయాలి, అధిక బరువు ఉంటే వైద్యుల సూచనలతో తగ్గించుకోవాలి, ఇది ముఖ్యంగా మోకాళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది, పోషకాహారం తీసుకుంటూ సమతుల్యమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి, కీళ్లపై అధిక ఒత్తిడి కలిగించే పనులను తగ్గించి, అవసరమైన విశ్రాంతి తీసుకోవాలి, కీళ్ల నొప్పులను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్యులను సంప్రదించాలి, వైద్యుల సలహా లేకుండా నొప్పి నివారణ మందులు, స్టెరాయిడ్లు లేదా ఇతర మందులను దీర్ఘకాలం వాడకూడదు. సకాలంలో వైద్య చికిత్స ఎంతో ముఖ్యమన్నారు. ఆర్థరైటిస్‌కు ప్రారంభ దశలోనే సరైన నిర్ధారణ, తగిన చికిత్స తీసుకోవడం ద్వారా నొప్పిని నియంత్రించుకోవడంతో పాటు కీళ్ల పనితీరును కాపాడుకోవచ్చు, ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వ్యాధుల్లో చికిత్స ఆలస్యం కాకుండా చూడాలని, కీళ్లలో అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి, వాపు, ఎరుపుదనం, జ్వరంతో కూడిన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం పొందాలన్నారు.
2026 సంవత్సరం సందేశం: “కీళ్ల ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది - అవగాహన పెంచుకుందాం, ఆర్థరైటిస్‌ను ఎదుర్కొందాం!” అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పీఎంపీ నాయకులు శాఖవరపు వేణుగోపాల్, గోరంట్ల శేషయ్య, దేవరకొండ శ్రీనివాసులు, నరసాపురం ప్రసాద్, చిట్లూరు వీరయ్య సభ్యులు పాల్గొన్నారు.