BREAKING
మహంకాళి ఆలయ ఆర్చ్‌పై దాతల పేర్ల వివాదం..! * రూ.12 లక్షలతో ఆర్చ్ నిర్మిస్తే.. దాతగా మరో పోలీస్ అధికారి పేరు ! అసలైన దాతలకు అన్యాయం ! చైనా సంస్థల కొనుగోలుకు ఇటలీలో ఉత్పాదక ప్లాంట్లు అందుబాటులో లేవు వెనెజువెలా నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడిపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా ఐసీఐసీఐ లంబార్డ్ త్రైమాసిక ఫలితాల జోరు జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ షేర్లలో 47 శాతం ర్యాలీకి అవకాశం: ఆకర్షణీయమైన వాల్యుయేషన్లతో ‘బై’ రేటింగ్ ఇచ్చిన మోతీలాల్ ఓస్వాల్! కేఎండీఎస్ ట్యాంక్ తయారీ సంస్థలో జర్మనీ ప్రభుత్వం భారీ వాటా కొనుగోలు దిశగా చర్చలు నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయం. మరోసారి లాయర్‌గా కీర్తి సురేష్.. ‘సత్యవాన్ సావిత్రి’ అఫీషియల్ టీజర్ రిలీజ్! కొమ్ము గోపాల్‌రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మంచిర్యాలలో నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్ డబల్ ఇంజిన్ సర్కార్ తో రాష్ట్రం మరింత అభివృద్ధి : ఎమ్మెల్యే బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ ట్రెడిషనల్ లుక్.. లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్! పొన్నూరులో స్నేహ మ్యాక్స్ బాధితుల ఆవేదన - రూ.36 కోట్ల డిపాజిట్లు తిరిగి ఇవ్వాలని డిమాండ్ టెక్ కంపెనీ బెండింగ్ స్పూన్స్‌లో 4 శాతానికి పెరిగిన వాటా రామాయణం ట్రైలర్ 2 లాంచ్ ఈవెంట్.. బెంగళూరులో రణ్‌బీర్ కపూర్, యశ్ సందడి!

ఆరోగ్య రక్షణ కోసం ఆర్ఓ మంచినీరు... యూనియన్ బ్యాంక్ వారికి కృతజ్ఞతలు

Select Suryaa Now
ఆరోగ్య రక్షణ కోసం ఆర్ఓ మంచినీరు...  యూనియన్ బ్యాంక్ వారికి కృతజ్ఞతలు

దత్తిరాజేరు, సూర్య : గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఆర్వో వాటర్ ప్లాంట్  ద్వారా శుద్ధి చేయబడిన మంచినీటిని అందించడం జరుగుతుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దత్తిరాజేరు మండలం సరయవలస గ్రామంలో యూనియన్ బ్యాంక్ సి ఎస్ ఆర్ నిధులతో నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను మంగళవారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చినప్పుడు గ్రామంలో కలుషిత నీరు తాగడంతో క్యాన్సర్ సంబంధిత వ్యాధులు వస్తున్నాయని త్రాగునీరు అందించాలని ప్రజలు వాపోయారన్నారు. .ప్రజలఆరోగ్యరీత్యా గ్రామంలో మంచినీరు అందించాలనే సంకల్పంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో నాలుగు వాటర్ ప్లాంట్లు అందించిన యూనియన్ బ్యాంక్ వారికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామం తో పాటు పరిసర ప్రాంతాలకు శుద్ధి చేయబడిన మంచినీటిని అందించడానికి ఎలక్ట్రికల్ వెహికల్స్ సైతం అందుబాటులో ఉంటుందన్నారు. ఆరోగ్యం మెరుగుపరచుకోవటం కోసం శుద్ధి చేయబడిన నీటిని త్రాగాలన్నారు. గ్రామాలను అభివృద్ధి పరచడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీ బలపరిచిన అభ్యర్థులకు భారీ మెజార్టీ తీసుకురావాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చప్పా చంద్రశేఖర్,నాయకులు మిత్తిరెడ్డిరామ, బోడసింగి సత్తిబాబు, మిత్తిరెడ్డి ఈశ్వరరావు, పెద్దింటిమోహన్, బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ సునీత్ తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : అప్పలనాయుడు, దత్తిరాజేరు,  విజయనగరం జిల్లా.