BREAKING
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలసిన కార్పొరేటర్ షాహినా. ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ సదాశివపల్లిలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన పరిషత్ ఎన్నికల ప్రచారం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఓటు హక్కును నిలబెట్టుకుందాం! ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీ కలిసిన కార్పొరేటర్ శంకర్ యాదవ్. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో సరళ ఫిజిక్స్ కాన్‌క్లేవ్`2026 కొమ్మరపూడి నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ ఆందోళన! టవర్ లైట్స్ కి శంకుస్థాపన అగ్ని ప్రమాదంలో బస్సు దగ్ధం చంద్రబాబును కలిసిన కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ ఏపిలగుంటలో పొడమేకల ముమ్మర ప్రచారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై లారీలు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు! భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనగా నిర్వహించిన గ్రామ సర్పంచ్

ఆనందపురం లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
ఆనందపురం లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ఆనందపురం, మేజర్ న్యూస్ : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్ర, ఆర్థిక శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు.
ముందుగా కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు అంతా కలిసి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాలతో ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ఆర్థిక శాస్త్ర విభాగాధిపతి శ్రీ వాసుదేవరావు గారు మాట్లాడుతూ, భారతదేశం అతిపెద్ద లిఖిత రాజ్యాంగం గల గణతంత్ర దేశమని, పౌరులు, పాలకులు, పాలనా యంత్రాంగం పాటించాల్సిన అత్యున్నత చట్టమే రాజ్యాంగమని తెలిపారు. రాజ్యాంగంలో 22 ప్రకరణలు, 440కి పైగా అధికరణలు ఉన్నాయని, అది దేశ ఆత్మ అని పేర్కొన్నారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా ఈ రోజును రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్)గా జరుపుకుంటామని తెలిపారు.
రాజనీతి శాస్త్ర విభాగాధిపతి తల్లాబు సుమిత్ర మాట్లాడుతూ, పౌరులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కల్పించడం, ప్రాథమిక హక్కులు మరియు విధులపై అవగాహన పెంచడమే రాజ్యాంగ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మరియు ఇతర సభ్యుల కృషిని ఈ సందర్భంగా స్మరించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల తెలుగు శాఖాధిపతి డాక్టర్ రేచర్ల శ్రీలక్ష్మి, గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ విజయకుమార్, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.