BREAKING
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలసిన కార్పొరేటర్ షాహినా. ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ సదాశివపల్లిలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన పరిషత్ ఎన్నికల ప్రచారం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఓటు హక్కును నిలబెట్టుకుందాం! ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీ కలిసిన కార్పొరేటర్ శంకర్ యాదవ్. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో సరళ ఫిజిక్స్ కాన్‌క్లేవ్`2026 కొమ్మరపూడి నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ ఆందోళన! టవర్ లైట్స్ కి శంకుస్థాపన అగ్ని ప్రమాదంలో బస్సు దగ్ధం చంద్రబాబును కలిసిన కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ ఏపిలగుంటలో పొడమేకల ముమ్మర ప్రచారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై లారీలు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు! భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనగా నిర్వహించిన గ్రామ సర్పంచ్

ఆకాశలక్కవరంలో ప్రత్యేక పోలీసు బందోబస్తుకు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు!

Select Suryaa Now
ఆకాశలక్కవరంలో ప్రత్యేక పోలీసు బందోబస్తుకు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు!

 

∆. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే అవకాశం ఉందని మాజీ ఎంపీటీసీ సుగ్గు నిర్మల ఆందోళన

∆. ఫిర్యాదును జిల్లా కలెక్టర్‌కు పంపిన రాష్ట్ర ఎన్నికల కమిషన్

సంతబొమ్మాళి, నవంబర్ 26, మేజర్ న్యూస్ :

మండలంలోని ఆకాశలక్కవరం గ్రామ పంచాయతీలో డిసెంబర్ 2న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీటీసీ సుగ్గు నిర్మల రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. గత ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని ఆమె చేసిన విజ్ఞప్తిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. ఆమె ఫిర్యాదును తగిన చర్యల నిమిత్తం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌కు పంపిస్తూ ఈ నెల 18న అధికారిక లేఖ జారీ చేసింది. ఈ నెల 14న సుగ్గు నిర్మల సమర్పించిన ఫిర్యాదులో ఆకాశలక్కవరం పంచాయతీలో రాజకీయ జోక్యం, ఓటర్లు, అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం, ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్లు, పోటీలో ఉన్న అభ్యర్థులు తమ ప్రజాస్వామ్య హక్కులను స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రత్యేక పోలీసు బందోబస్తుతో పాటు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా ఆకాశలక్కవరం పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని, వైఎస్సార్‌సీపీ నాయకులు, పోలింగ్ ఏజెంట్లపై దాడులు చేసి వారిని బలవంతంగా బయటకు పంపించారని, రిగ్గింగ్‌కు పాల్పడినట్లు ఆమె ఆరోపించారు. ఈ ఘటనల సమయంలో స్థానిక పోలీసులు అధికార పార్టీ నాయకులకు సహకరించారన్న విమర్శలను కూడా తన ఫిర్యాదులో ప్రస్తావించినట్లు తెలిపారు. గత ఎన్నికల అనుభవాల నేపథ్యంలో రానున్న పంచాయతీ ఎన్నికల్లోనూ అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసులను నియమించి, గ్రామంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులు, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
సుగ్గు నిర్మల ఫిర్యాదును పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ జాయింట్ డైరెక్టర్ పి. రామారావు, లేఖ నంబరు 1027/SEC-B2/2026, తేదీ 18.11.2026 ద్వారా జిల్లా కలెక్టర్‌కు పంపించారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో సూచించారు. దీంతో ఆకాశలక్కవరం పంచాయతీ ఎన్నికల భద్రతా ఏర్పాట్ల అంశం అధికార యంత్రాంగం దృష్టికి చేరింది.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలంటే ప్రతి ఓటరు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా తన ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల యంత్రాంగంపై ఉందని సుగ్గు నిర్మల పేర్కొన్నారు.