BREAKING
జగ్గయ్యపేట మున్సిపాలిటీ పై వైస్సార్ సీపీ జెండా ఎగరడం కాయం... పీటీ ఉష 42 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన అథ్లెట్ విత్య రామరాజ్ ను అభినందించిన హీరో ధనుష్! మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజా జీవితంపై ఏపీ కేబినెట్ కీలక తీర్మానం: చంద్రబాబు ప్రశంసలు సీఎం చంద్రబాబుతో మంత్రి నారాయణ భేటీ: రాజధాని భూములపై కీలక చర్చ విజయవాడలో పండుగల సందడి.. సరస్ మేళా, దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్‌తో నగరానికి కొత్త శోభ ఆసరా కోసం.. వృద్ధురాలి అవస్థలు! పంట పండించే రైతు లేకపోతే ప్రపంచానికే మనుగడలేదు. గొట్టిపాటి లక్ష్మి నాకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఈ సినిమా.. 'గరివిడి లక్ష్మి' ట్రైలర్ వేడుకలో నటి ఆనంది భావోద్వేగం! ప్రజల ఆరోగ్య భద్రతకు అండగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కళాశాలకు ఇన్వర్టర్ సిస్టం బహుకరణ చింతలపూడిలో చట్టాలపై అవగాహన సదస్సు ఉరవకొండ గురుకుల పాఠశాలలో కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ తనిఖీ టి. నర్సాపురంలో పేద విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం అంతరిక్ష విజ్ఞానాన్ని అధ్యయనం చేసి సృజనాత్మక ఆవిష్కరణలకు విద్యార్థులు బాటలు వేయాలి- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

ఆదిత్యలో వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌లో ఎంఐపై సాంకేతిక సదస్సు

Select Suryaa Now
ఆదిత్యలో వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌లో ఎంఐపై సాంకేతిక సదస్సు


- హాజరైన తిరుచిరాపల్లి (ఎన్ఐటి) అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి.చంద్రబాబు నాయక్
మదనపల్లె : పుంగనూరు రోడ్డులోని అదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ మదనపల్లెలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసిఈ) విభాగం ఆధ్వర్యంలో బుధవారం చివరి సంవత్సరం బీటెక్ ఈసీఈ విద్యార్థుల కోసం "ఇంటిగ్రేటింగ్ మెషిన్ లెర్నింగ్ ఇంటు వీఎల్‌ఎస్‌ఐ డిజైన్ ఫ్లో అండ్ ఆర్.టి.ఎల్ జిడి ఎస్ఐఐ ఆటోమేషన్" అనే అంశంపై సాంకేతిక సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యవక్తగా హాజరైన తమిళనాడు తిరుచిరాపల్లి (ఎన్ఐటి) అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి.చంద్రబాబు నాయక్ తమిళనాడు మాట్లాడుతూ ఆధునిక సెమీకండక్టర్ పరిశ్రమలో మెషిన్ లెర్నింగ్ (ఎం.ఎల్),వీఎల్ఎస్ఐ డిజైన్ ఆటోమేషన్,ఆర్టీఎల్ డిజైన్ నుంచి జిడిఎస్ఐఐ వరకు డిజైన్ ఫ్లో వంటి సాంకేతిక అంశాలు కీలకంగా మారుతున్నాయని తెలిపారు.చిప్ డిజైన్ ప్రక్రియలో మెషిన్ లెర్నింగ్‌ను సమర్థవంతంగా అనుసంధానం చేయడం ద్వారా డిజైన్ ఆటోమేషన్,ఆప్టిమైజేషన్,పనితీరు,సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచవచ్చని వివరించారు.అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాయుడు పేయ్యాల మాట్లాడుతూ పరిశ్రమలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిణామాలను విద్యార్థులకు పరిచయం చేయడంలో ఇలాంటి నిపుణుల సాంకేతిక సదస్సులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఆర్.రామమోహన్ రెడ్డి,ప్రెసిడెంట్ ఎం.నాగమల్లా రెడ్డి,డైరెక్టర్ డాక్టర్ ఎస్.రామలింగా రెడ్డి,ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ కె.వి.వరప్రసాద్ తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.అనంతరం ముఖ్య వక్త డాక్టర్ బి.చంద్రబాబు నాయక్ ను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది.