విద్యాశాఖలో 37 ఏళ్ల సేవలకు ఘన వీడ్కోలు.
గన్నవరం, అక్టోబర్ 3,: విద్యాశాఖలో 37 సంవత్సరాలపాటు విశిష్ట సేవలందించిన ప్రధానోపాధ్యాయుడు కొల్లీ సత్య జగదీశ్వరరావు ఉద్యోగ విరమణ సందర్భంగా ఆత్మీయ అభినందన సభ నిర్వహించనున్నారు. గన్నవరం మండలం గొల్లనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా సేవలందించిన ఆయనకు సహచరులు, విద్యార్థులు, అభిమానులు ఘనంగా సత్కారం చేయనున్నారు. ఈ సందర్భంగా అక్టోబర్ 4న ఆదివారం గన్నవరంలోని డాక్టర్ సి.ఎల్. రాయుడు రోటరీ ఆడిటోరియంలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి రాగ సుధామయి క్రియేషన్స్ వారి సంగీత విభావరి, 11 గంటలకు సన్మాన కార్యక్రమం, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి విందు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 37 ఏళ్లపాటు విద్యారంగానికి సేవలందించిన జగదీశ్వరరావుకు ఆత్మీయంగా వీడ్కోలు పలికేందుకు సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని నిర్వాహకులు కోరారు.
సూర్య ప్రతినిధి (గుర్రం ప్రసాద్).