35వ డివిజన్ టిడిపి అభ్యర్థిగా రమణి
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. 35వ డివిజన్ టిడిపి కార్పొరేటర్ అభ్యర్థిగా చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాల డెవలప్మెంట్ కమిటీ సభ్యులు, రాష్ట్ర వన్య కుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్ సతీమణి రమణి ఆదివారం నగరం లోని నాగయ్య కళాక్షేత్రం సమీపంలో గల లాలూ గార్డెన్ స్వర్ణ వార్డు సచివాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియా తో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం లో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, చిత్తూరు లో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చేస్తున్న అభివృద్ధి లో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో తాను 35వ డివిజన్ టిడిపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని తెలిపారు. తనకు అవకాశం కల్పించిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కు కృతజ్ఞతలు తెలిపారు. 35వ డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని తన ప్రధాన ఉద్దేశమని కావున ప్రజలు తనను ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్