32 వ వార్డు టిడిపి అభ్యర్థి స్వాములను గెలిపించండి... మాండ్ర..!
32 వ వార్డు టిడిపి అభ్యర్థి స్వాములను గెలిపించండి... మాండ్ర..!
- పట్టణ అభివృద్ధికి సహకరించండి
- సీఎస్ఐ పాలెం లో మాండ్ర ఎన్నికల ప్రచారం
నందికొట్కూరు రూరల్ మేజర్ న్యూస్ -: 32వ వార్డు టిడిపి అభ్యర్థి స్వాములను గెలిపించి నందికొట్కూరు పట్టణ అభివృద్ధికి సహకరించాలని టిడిపి సీనియర్ నాయకులు మాండ్ర శివానందరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు . సోమవారం పట్టణం లోని సీఎస్ఐ పాలెం 32వ వార్డులో నిర్వహించిన “చెప్పాం.. చేస్తున్నాం” అంటూ డోర్ టు డోర్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నందికొట్కూరు టిడిపి సీనియర్ నాయకులు మాండ్ర శివానందరెడ్డి పాల్గొన్నారు . ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరించి, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పట్టణ అభివృద్ధి, సూపర్ 6 సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు . నందికొట్కూరు కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మొల్ల సాబీరున్నిసా కి, 32వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి స్వాములు కి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు .ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గుంజుపల్లె భాస్కర్ రెడ్డి , వార్డు ఇన్చార్జులు డా. వనజ , సగినేల రమణ , దామరేకుల రాజు , అయ్య రాజు , బేతి జయన్న కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .