2.85 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్
రూ.2.85 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ మరియు మైనార్టీ నాయకులు.
మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని శాసనమండలి మాజీ చైర్మన్, రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల సలహాదారు మహమ్మద్ షరీఫ్ ,పొన్నూరు ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ స్పష్టం చేశారుపొన్నూరు పట్టణంలోని 25వ వార్డులో ఉర్దూఘర్, షాదీఖానా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రూ.2.85 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు మంగళవారం శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహమ్మద్ షరీఫ్ , గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ , ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ షిబ్లి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూచట్టసభల్లో అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలిపారు. గత శాసనసభ ఎన్నికల్లో ముగ్గురు మైనార్టీలకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించారని గుర్తుచేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మైనార్టీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో వారికి ప్రాధాన్యతనిస్తూ రాజకీయ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.రాయలసీమ ప్రాంతంలో మైనార్టీలు అధికంగా ఉన్న ప్రాంతాలకు మూడు నుంచి నాలుగు చైర్మన్ పదవులు కేటాయించే అవకాశం ఉందని తెలిపారు. కోస్తా ప్రాంతంలోనూ మైనార్టీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు అవసరమైన చోట్ల ఎంపీటీసీ, జడ్పీటీసీ, కో-ఆప్షన్ పదవుల్లో వారికి ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.2024 ఎన్నికల సమయంలో మైనార్టీలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు. పొన్నూరు నియోజకవర్గంలో మైనార్టీలకు మార్కెటింగ్ యార్డు చైర్పర్సన్ , సొసైటీ చైర్మన్ పదవులను కేటాయించి రాజకీయంగా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. మైనార్టీల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని స్పష్టం చేశారు.
పొన్నూరులో ఉర్దూఘర్, షాదీఖానా నిర్మాణాన్ని పూర్తి చేయడం మైనార్టీలకు ఇచ్చిన హామీల్లో ముఖ్యమైనదని పేర్కొన్నారు. 2018లో 52 సెంట్ల స్థలంలో షాదీఖానా నిర్మాణానికి రూ.1.25 కోట్ల నిధులు కేటాయించి పనులు ప్రారంభించామని, అయితే 2019లో ప్రభుత్వం మారిన తరువాత నిర్మాణం నిలిచిపోయిందనితెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ ఫరూఖ్ సహకారంతో అదనపు నిధులుమంజూరు చేయించి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉర్దూఘర్లు, షాదీఖానాల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, అమరావతిలో ఐదు ఎకరాల స్థలంలో హజ్ హౌస్ నిర్మాణం చేపట్టే దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.గతంలో తన తండ్రి వీరయ్య చౌదరి మైనార్టీలకు అండగా నిలిచి వారి హక్కుల కోసం పోరాడారని గుర్తుచేసిన ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ , తమ కుటుంబం ఎల్లప్పుడూ మైనార్టీ సోదరులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నూరానీ వెల్ఫేర్ సొసైటీకి కంప్యూటర్నుఅందజేశారు.
ఈ కార్యక్రమంలో 25 వ వార్డు మాజీ కౌన్సిలర్ భాష అంజుమన్ అధ్యక్షులు మగ్బూల్ బేగ్ మున్సిపల్ కమిషనర్ ఎం రమేష్ బాబు మైనార్టీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్:- శిలార్