BREAKING
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం: ఈ నెల 14 లేదా 15న నోటిఫికేషన్ విడుదల! బంగ్లాదేశ్‌లో వైభవంగా మహాలయ వేడుకలు దసరా సెలవులు.. విద్యార్థులకు అవస్థలు! జై శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో, ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు* పాకల బీచ్ విషాదంపై ఎమ్మెల్యే తాటిపర్తి దిగ్భ్రాంతి.. "సంతాపంతో సరిపెట్టొద్దు తాగునీరు కరువు.. రోడ్డెక్కిన కాలనీవాసులు *పూల పండుగకు శ్రీకారం.. పల్లెల్లో బతుకమ్మ సందడి!* *•ఆటపాటలతో అంబరాన్నంటిన సంబురాలు* కోటి రూపాయలతో రోడ్డు పనులకు శంకుస్థాపన సముద్రపు దీపస్తంభాల అద్భుత రూపాంతరం త్రివేణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు వారణాసిలో ఫిట్ ఇండియా సైకిల్ యాత్ర...ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రేపు తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో మెగాస్టార్ చిరంజీవి పర్యటన దసరా సంబరాల టెండర్లలో గోల్‌ మాల్‌ - ఎసి విచారణ - టెండర్లు రద్దు? తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి కేటీఆర్ అండ ముగ్గురు ఆడబిడ్డల పేరిట ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్

17 వ వార్డులో త్రాగునీటి సమస్యకు పరిష్కారం.. వార్డు అధ్యక్షుడు ఏడువాక సన్యాసిరావు

Select Suryaa Now
 17 వ వార్డులో త్రాగునీటి  సమస్యకు పరిష్కారం..  వార్డు అధ్యక్షుడు  ఏడువాక సన్యాసిరావు

ఆరిలోవ, సూర్య : జీవీఎంసీ,16వ వార్డు పైనాపిల్ కాలనీ వద్ద గల జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బ్లాక్స్‌లో నెలకొన్న నీటి ఎద్దడిని పరిష్కరించేందుకు  శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు  ఆదేశాల మేరకు మరో కొత్త బోరు వేయించే పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వార్డు నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులతో కలిసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.
ఈ కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉందని స్థానిక ప్రజలు 16వ వార్డు టీడీపీ అధ్యక్షులు ఏడువాక సన్యాసిరావు  దృష్టికి తీసుకువచ్చారు. ఆయన ఈ సమస్యను ఎమ్మెల్యే  వెలగపూడి రామకృష్ణ బాబు దృష్టికి తీసుకెళ్లడంతో ప్రజల ఇబ్బందులను తొలగించే దిశగా తక్షణ చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా వార్డు టీడీపీ అధ్యక్షులు ఏడువాక సన్యాసిరావు మాట్లాడుతూ పైనాపిల్ కాలనీలోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బ్లాక్స్‌లో మొత్తం 13 బ్లాకులు ఉండగా, ఒక్కో బ్లాక్‌లో 32 కుటుంబాల చొప్పున  416 కుటుంబాలు నివసిస్తున్నాయని తెలిపారు. ఇన్ని కుటుంబాలకు నీటి అవసరాలను తీర్చడంతో పాటు, భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండాలనే ముందుచూపుతో 6.5 అంగుళాల వ్యాసం కలిగిన పెద్ద బోరు వేయించే చర్యలు చేపట్టినట్లు వివరించారు.
ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చొరవ చూపుతున్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు కి వార్డు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఏడువాక  పేర్కొన్నారు. ప్రజలకు తాగునీటి వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని సంబంధిత ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని  పేర్కొన్నారు. 
ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి పొత్రకండ ధర్మారావు, వార్డు ప్రధాన కార్యదర్శి తురకపూడి బాలస్వామి, ఉపాధ్యక్షులు మారిక జక్కన్న,  సీనియర్ నాయకులు యల్లమిల్లి సురేష్, వాటర్ వర్క్స్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్, కాలనీ మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : శ్రీనివాస్, అరిలోవా, విశాఖపట్నం.