134 మందికి సీఎం సహాయ నిధి అందజేత
నరసాపురం, మేజర్ న్యూస్ :స్థానికఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం 134 మంది లబ్ధిదారులకు రూ. 58 లక్షల 78 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ పంపిణీ చేశారు.చెక్కుల పంపిణీ అనంతరం లబ్ధిదారులతో ఆయన ఆత్మీయంగా ముచ్చటించారు. వారి ఆరోగ్య పరిస్థితులను, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కష్టకాలంలో ప్రతి పేదవాడికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన భరోసానిచ్చారు.
రిపోర్టర్ ఇజ్రాయిల్ నరసాపురం పశ్చిమగోదావరి జిల్లా